కన్నుల పండువగా..
శ్రీగంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి నగరోత్సవ సేవ బుధవారం కన్నుల పండువగా సాగింది. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాల నుంచి ఊరేగింపును ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రారంభించారు. ఆది దంపతులు ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై కొలువై ఉండగా, మేళతాళాలు, మంగళవాయిద్యాల, భక్త జనుల కోలాట నృత్యాల మధ్య నగరోత్సవ సేవ అంగరంగ వైభవంగా సాగింది. మహా మండపం, కనకదుర్గానగర్, రథం సెంటర్, కెనాల్‌రోడ్డు, ఘాట్‌రోడ్డు మీదగా ఆలయానికి చేరుకుంది. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద దేవతా మూర్తులకు పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment