నరసరావుపేట రూరల్: పవిత్ర కార్తిక మాసం తొలిరోజున కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అభిషేకాల్లో పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక అలంకరణలు చేశారు. శనివారం తెల్లవారుజాము నుంచి ఆలయంలో భక్తుల తాకిడి నెలకొంది. అయ్యప్పమాలధారులు తొలిపూజలో పాల్గొన్నారు. ఆలయం వెనుక ఉన్న రావిచెట్టు వద్ద మహిళలు కార్తిక దీపాలు వెలిగించి పూజలు జరిపారు. ధ్యానశివుడు, నాగేంద్రుడి పుట్ట, మహానందీశ్వరుడు విగ్రహాల వద్ద భక్తులు పూజలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment