సందీప్ కుటుంబానికి ఆర్థిక సాయం
బాపట్ల: పేర్లి గ్రామనికి చెందిన దోమతోటి విజయమ్మ కొడుకు సందీప్ విద్యుత్ శాఖలో లైన్ మ్యాన్‌కి హెల్పర్‌గా పనిచేస్తూ కరెంట్ షాక్ తగిలి చనిపోవటంతో కలెక్టర్ సాయం అందించారు. ఆ కుటుంబానికి రెండు సంవత్సరాల నుంచి ఆర్థిక భరోసా లేకపోవటంతో జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళికి గ్రీవెన్‌న్స్‌లో అర్జీ ఇచ్చిన 15 రోజులలో ఆ కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయం, ఉద్యోగ భద్రత కల్పించారు. కలెక్టర్‌కి సోమవారం ఈరోజు గ్రీవెన్‌న్స్‌కు వచ్చి కృతజ్ఞతలు తెలిపారు.
యోగాలో సత్తా చాటిన చందలూరు విద్యార్థులు
జే.పంగులూరు: జాతీయ స్థాయి యోగా పోటీలకు చందలూరు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈనెల 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నెల్లూరులో 68వ యోగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. ఈపోటీల్లో అండర్–14 విభాగంలో ఎన్ శృతి మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి యోగా పోటీలను ఎంపికై నట్లు పాఠశాల పీడీ ప్రతిమ సోమవారం తెలిపారు. నేషనల్ స్టాండ్‌బైలో కే సరిత ఎంపికై నట్లు తెలిపారు. టీమ్ ఈవెంట్‌లో చందలూరు విద్యార్థులు 3వ స్థానం సాధించనట్లు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గిరిజ, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందిచారు.
గుర్తుతెలియని వ్యక్తి
మృతదేహం లభ్యం
రేపల్లె రూరల్: గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన పట్టణంలోని రైల్వేస్టేషన్ పక్కన ఉన్న రహదారిలో చోటు చేసుకుంది. సీఐ మల్లికార్జునరావు అందించిన వివరాలు.. మృతుడు 60 నుంచి 65 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటాడని, నీలం రంగు చొక్కా, గోధుము రంగు లుంగీ ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాల మార్చురీకి తరలించటం జరిగిందని, మృతుని బంధువులు ఎవరైనా ఉంటే మృతదేహాన్ని తీసుకెళ్లాలని సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment