రేపు క్రోసూరులో జాబ్ మేళా
క్రోసూరు: డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ అధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ), ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, సీడాప్ సంయుక్తంగా జాబ్ మేళా నిర్వహించనున్నాయి. ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి.తమ్మాజీరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రోసూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఈ మేళా ఉంటుందని వివరించారు. వివరాలకు బి.అంజి రెడ్డిని 94949 86164 , ఇ.రామకృష్ణారెడ్డిని 80743 93466 నెంబరల్లలో సంప్రదించవచ్చన్నారు.
విద్యార్థిని ఆత్మహత్యపై
నివేదికకు ఆదేశం
నరసరావుపేట రూరల్: పట్టణంలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై నివేదిక అందజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బత్తుల పద్మావతి ఆదివారం ఆదేశించారు. పోలీస్, విద్యాశాఖ దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని తెలిపారు. బాలిక తల్లిదండ్రులకు సానుభూతి తెలియజేశారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని పేర్కొన్నారు. పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో
వైద్యుడు మృతి
పిడుగురాళ్ల: రోడ్డు ప్రమాదంలో డాక్టర్ మృతి చెందిన సంఘటన పట్టణంలోని సూర్యసెమ్ వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన సౌజన్య హాస్పటల్ డాక్టర్ కృష్ణంశెట్టి శ్రీధర్ దాచేపల్లి పట్టణంలో ఓ ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్ నిర్వహించి తిరిగి పిడుగురాళ్ల వస్తున్నారు. సూర్యసెమ్ వద్దకు రాగానే లారీ బయటకురావటంతో వెనుక నుంచి దానిని కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలాన్ని పిడుగురాళ్ల పట్టణ పోలీసులు పరీశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment