ఆకట్టుకున్న కవి సమ్మేళనాలు
అద్దంకి: గ్రంథాలయమంటే ఎంతో పవిత్రమైనదని సృజన అధ్యక్షుడు, రచయిత గాడేపల్లి దివాకర దత్తు అన్నారు. ఆదివారం అద్దంకి శాఖా గ్రంథాలయంలో వారోత్సవాల సందర్భంగా కవి సమ్మేళనాన్ని లైబ్రేరియన్ సుగుణరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పుస్తకంతో మైత్రికి స్వాగతం పలికి సెల్‌ఫోన్ చెర నుంచి విముక్తి పొందాలని కవులు అభిప్రాయపడ్డారు. కొల్లా భువనేశ్వరి, యనమండ్ర వరలక్ష్మి, పాలపర్తి జ్యోతిష్మతి, డాక్టర్ యు. దేవపాలన, ఆర్.రాఘవరెడ్డి, చందలూరి నారాయణరావు, ఇలపావులూరి శేషతల్పశాయి అంజాద్ బాషా, అనిల కుమారసూరి తమ కవితలను వినిపించారు. కార్యక్రమంలో సందిరెడ్డి శ్రీనివాసరావు, చప్పిడి వీరయ్య, అన్నమనేని వెంకట్రావు, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, మన్నం త్రిమూర్తులు, అద్దంకి దేవీప్రసాద్, పాటిబండ్ల శ్రీమన్నారాయణ, మారం కోటేశ్వరరావు, షేక్ మస్తాన్, పసుమర్తి కోటయ్య, కాకర్ల వెంకటేశ్వర్లు, మల్లాది శ్రీనివాసరావు, లక్ష్మీరాజ్యం తదితరులు పాల్గొన్నారు.
కవులకు సన్మానం..
చీరాల అర్బన్: 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను స్థానిక శాఖా గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం గ్రంథాలయంలో కవి సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు తమ కవిత్వాలతో ఆకట్టుకున్నారు. వడలి రాధాకృష్ణ, మంత్రి కృష్ణమోహన్, మేడబలిమి లూకా, పవని భానుచంద్రమూర్తి, సురేష్ చంద్రమూర్తి, కుర్రా రామారావు, ఆకురాతి ద్రాక్షాయినిలు వివిధ సామాజిక అంశాలపై కవితాగానం చేశారు. బాలలకు జనరల్ నాలెడ్జ్‌పై క్విజ్ పోటీలను నిర్వహించారు. క్విజ్ మాస్టర్‌గా పవని భానుచంద్రమూర్తి వ్యవహరించారు. అనంతరం కవులను గ్రంథపాలకురాలు డి.ధనమ్మ ఘనంగా సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment