వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదం
బాపట్లటౌన్: వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదపడుతాయని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ జి.కరుణాసాగర్ తెలిపారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2024–25 వార్షిక రెండో దశ అంతర కళాశాలల క్రీడా, సాంస్కృతిక, సాహిత్య పోటీలను ఆదివారం బాపట్ల వ్యవసాయ కళాశాలలో ప్రారంభించారు. కరుణాసాగర్ మాట్లాడుతూ క్రీడలను వర్సిటీ ప్రోత్సహిస్తోందని, వసతులు సమకూరుస్తోందని చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా డెప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్.జవహర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి డాక్టర్ రవికాంత్ రెడ్డి, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ పి. ప్రసూనా రాణి, డాక్టర్ ఎన్.టి.ఆర్. కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అసోసియేట్ డీన్ ఎం.సర్దార్ బేగ్, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ కళాశాల అసోసియేట్ డీన్ డి.డి.స్మిత్ పాల్గొన్నారు.
ఎన్జీ రంగా వర్సిటీ డీన్ కరుణాసాగర్ అంతర కళాశాలల క్రీడా, సాంస్కృతిక పోటీలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment