కాలువలో పసికందు మృతదేహం
గుంటూరు రూరల్: అప్పుడే పుట్టిన బిడ్డను కాలువలో పడేసిన సంఘటన మండలంలో కలకలం రేపింది. నగర శివారులోని గుంటూరు–పొన్నూరు రహదారి బుడంపాడు కాలువ కల్వర్టు దగ్గరలో రోజుల వ్యవధిగల మగశిశువు మృతదేహం ఉందన్న స్థానికుల సమాచారం మేరకు నల్లపాడు పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు. శిశువు మృతదేహాన్ని రుద్రట్రస్ట్ సభ్యుల సహకారంతో జీజీహెచ్ మార్చురీకి తరలించారు. సంఘఽటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి శిశువు మృతదేహం నీటిలో కొట్టుకువచ్చిందా? లేక ఎవరైనా తెచ్చి ఇక్కడ పడవేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ముగిసిన జేఎన్‌టీయూకే కబడ్డీ పోటీలు
ఒంగోలు: జేఎన్‌టీయూ కాకినాడ ఆధ్వర్యంలో స్థానిక రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్న సెంట్రల్ జోన్ అంతర కళాశాలల మహిళా కబడ్డీ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఫైనల్ మ్యాచ్‌లో గుడ్లవల్లేరు ఎస్‌ఆర్‌జీఈసీ కాలేజీ – గుంటూరు సెయింట్ మేరీస్ జట్లు తలపడగా, ఉత్కంఠ పోరు సాగింది. ఈ మ్యాచ్‌లో గుడ్లవల్లేరు కాలేజీ టీం విజేతగా నిలిచింది. గుంటూరు సెయింట్ మేరీస్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. విజేతలకు రైజ్ కృష్ణసాయి ప్రకాశం గ్రూప్ కాలేజీల కార్యదర్శి శిద్దా హనుమంతరావు, కోశాధికారి శిద్దా భరత్, రాగ చీఫ్ కో–ఆర్డినేటర్ శిద్దా ప్రవల్లిక, గౌరవ చైర్మన్ ఇస్కాల చినరంగమన్నార్, డైరెక్టర్ ఏవీ భాస్కరరావులు ట్రోఫీలు అందించారు. అనంతరం యూనివర్సిటీ జట్టును ఎంపిక చేశారు. ఎంపికై న యూనివర్సిటీ జట్టు ఈ నెల 26 నుంచి 30వ తేదీవరకు కేరళ రాష్ట్రం కొట్టాయంలో ఆడుతుందని ఫిజికల్ డైరెక్టర్ హేమచంద్ర తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment