విగ్రహ ప్రతిష్టలో హైకోర్టు జడ్జి దంపతులు
పర్చూరు (చినగంజాం): మండలంలోని అన్నంబొట్లవారిపాలెంలో నూతనంగా నిర్మించిన గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఆదివారం అంగరంగవైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలి రావడంతో గ్రామంలో పండుగ వాతావరణ నెలకొంది. స్వామి వారి విగ్రహాలతోపాటు ఆదివారం ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా నిర్వహించడంతో భక్తులతో ఆలయం కిక్కిరిసి పోయింది. ఆలయంలోకి వచ్చిన మహిళా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అందరికీ అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి కే సురేష్‌రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. చిలకలూరిపేట జూనియర్ సివిల్ జడ్జి కే నరేంద్రరెడ్డి, చీరాల జూనియర్ సివిల్ జడ్జి నిషాద్ నాంచ్, హిందూ ధార్మిక పరిషత్ అధ్యక్షులు బూచేపల్లి సత్యనారాయణ, ఆయన సతీమణి లలితాంబ, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
నేటి నుంచి మండల స్థాయిలోనూ పీజీఆర్‌ఎస్
బాపట్లటౌన్: సోమవారం నుంచి మండల, మున్సిపల్ స్థాయిలోనూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సమీప మండల కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు.
పవర్ లిఫ్టర్లు ఎంపిక
మంగళగిరి: ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో జరిగే సౌత్ ఇండియా సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ మెన్, ఉమెన్ ఎక్యూప్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు గుంటూరు జిల్లా నుంచి 13 మంది పవర్ లిఫ్టర్లు ఎంపికై నట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్మాకుల విజయభాస్కరరావు, కార్యదర్శి సంధాని తెలిపారు. ఆదివారం కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. ఎంపికై న పవర్ లిఫ్టర్లు 43 కేజీల విభాగంలో శ్రావణి, 84 కేజీల విభాగంలో లక్ష్మీ వినయశ్రీ, 63 కేజీల విభాగంలో పి.అంజలి, 47 కేజీల విభాగంలో ఎం షనూన్, 84 కేజీల విభాగంలో ఎష్‌కే షబీనా, 76 కేజీల విభాగంలో చతుర్య, 76 కేజీల విభాగంలో బి చంద్రిక, 74 కేజీల విభాగంలో హేమవర్థన్, 93 కేజీల విభాగంలో నాగగణేష్, 76 కేజీల విభాగంలో రమేష్ శర్మ, 105 కేజీల విభాగంలో పృధ్వీ, 93 కేజీల విభాగంలో ఎస్ కౌషిక్, 59 కేజీల విభాగంలో భరత్‌కుమార్‌లు ఎంపికై నట్లు తెలిపారు.
వేణుగోపాలస్వామికి లక్ష తులసి దళార్చన
చేబ్రోలు : వేజెండ్ల గ్రామంలోని వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఆదివారం లక్ష తులసి దళార్చన వైభవంగా జరిగింది. కార్తిక మాస పర్వదినాలను పురస్కరించుకుని లోక హితార్థం లక్ష తులసి పూజా కార్యక్రమం పండితులు నిర్వహించారు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం ఉదయం సుప్రభాత సేవ, అనంతరం స్వామికి పంచామృత అభిషేకం చేశారు. తర్వాత ప్రత్యేక అలంకరణలో స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. విశ్వక్సేన ఆరాధన మండపారాధన పుణ్యాహవచనం అజస్త్ర దీపారాధన, లక్ష్మీనారాయణ యజ్ఞం జరిగాయి. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామికి పంచామృత అభిషేకం అనంతరం అష్టోత్తర కలశాలతో గ్రామోత్సవం నిర్వహించారు. అర్చకులు మాల్యవంతం రాఘవ కుమార్ పర్యవేక్షణలో శాంతి కళ్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment