నృత్యనూతనం
బాలోత్సవ్ భల్లే.. భల్లే
పెదకాకాని: వీవీఐటీలో మూడు రోజులపాటు జరిగిన బాలోత్సవ్–2024 అట్టహాసంగా ముగిసింది. సమాజ హితం కోరేలా ఆద్యంతం సాగిన విద్యార్థుల ప్రదర్శనలు ఆలోచింపజేశాయి. పెదకాకాని మండలం నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఆదివారం జరిగిన బాలోత్సవ్ ముగింపు ఉత్స వంలో ముఖ్య అతిథిగా నాగార్జున సిమెంట్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాసిరెడ్డి విక్రాంత్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ భాష, సాహిత్యంపై పట్టు ఉంటే జీవితంలో విజయం సాధ్యమవుతుందని చెప్పారు. మన సంస్కృతిని, భాషను పరిరక్షించుకోవాలని సూచించారు. కళల్లో రాణిస్తే అవకాశాలు తలుపు తడతాయని చెప్పారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కూ సృజనాత్మకత అవసరమని స్పష్టం చేశారు. గుంటూరు ఘనత తెలుపుతూ ఆయన పాడిన పద్యం ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది.
బాలోత్సవ్ విజయవంతం
కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ కళాశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది సమష్టి కృషితో ఈ ఏడాది బాలోత్సవ్ జయప్రదమైందని ఆనందం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 25,000 మంది ప్రేక్షకులు హాజరుకావడం గర్వకారణమన్నారు. అనంతరం 20 అంశాల్లో 61 విభాగాలుగా జరిగిన ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలతోపాటు రెండు ప్రత్యేక బహుమతులను ప్రదానం చేశారు.
ఆఖరి రోజూ అట్టహాసంగా..
ఆఖరి రోజూ బాలోత్సవ్ అట్టహాసంగా జరిగింది. శాసీ్త్రయ, జానపద బృందాలు నృత్యాలతో అలరించాయి. 52 జానపద బృందాలు 3 వేదికల వద్ద నృత్య జాతరను తలపించాయి. 36 శాసీ్త్రయ నృత్య బృందాలు 2 వేదికలపై సత్తాచాటాయి. విచిత్ర వేషధారణలు తెలుగు సంస్కృతికి అద్దంపట్టాయి. మట్టి బొమ్మలు, కాగితపు చేతి బొమ్మల తయారీలోనూ చిన్నారులు ప్రతిభ కనబరిచారు.
వీవీఐటీలో ముగిసిన తెలుగు బాలల పండుగ ఆఖరి రోజూ అదరగొట్టిన విద్యార్థులు శాసీ్త్రయ, జానపద నృత్యాలతో కళకళ
Comments
Please login to add a commentAdd a comment