ఐటీడీపీ పోస్టులపై ఫిర్యాదు
లక్ష్మీపురం(గుంటూరుపశ్చిమ): వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతమ్మలపై సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టిన ఐటీడీపీ వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకుడు కొరిటిపాటి ప్రేమ్‌కుమార్ డిమాండ్‌చేశారు. గుంటూరు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం 54వ డివిజన్ కార్పొరేటర్ మల్లవరపు రమ్య, పార్టీ లీగల్ సెల్ నాయకులు మొండితోక శ్రీనివాస్‌లతో కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ అసభ్యంగా పోస్టులు పెట్టిన ఐటీడీపీ సోషల్ మీడియాపై గుంటూరు లాలాపేట, అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చలేదని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టులు చేసి, రిమాండ్‌కు పంపిస్తున్నారని, అయితే మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణిపై అసభ్యంగా పోస్టులు పెట్టిన ఐటీడీపీ కార్యకర్తలపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పక్షపాతం లేకుండా ఐటీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయాలని, లేదంటే తాము రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ సీఎం జగన్‌పై అసభ్యకరంగా
పోస్టులు పెట్టిన వారిని వెంటనే
అరెస్ట్ చేయాలి
అరండల్‌పేట, లాలాపేట
పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేసిన
వైఎస్సార్ సీపీ నాయకుడు ప్రేమ్‌కుమార్, కార్పొరేటర్ రమ్య
Comments
Please login to add a commentAdd a comment