వైఎస్సార్ సీపీని బలోపేతం చేద్దాం
తాడేపల్లిరూరల్: వైఎస్సార్ సీపీని బలోపేతం చేసేందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని ఓ ప్రైవేటు హాల్‌లో నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నాయకుల సమావేశం సోమవారం నిర్వహించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ గతంలో ఉన్న జిల్లా పార్టీ, మండల పార్టీ కమిటీలు, జిల్లా మండల అనుబంధ విభాగాల కమిటీలు, పార్టీ మండల, పట్టణ అధ్యక్షుల కమిటీలు, గ్రామ కమిటీలను రద్దు చేస్తూ వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తామని అన్నారు. క్లస్టర్ల జేసీఎస్, జిల్లా మండల అధ్యక్షులు పూర్తిగా రద్దు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతానికి జిల్లా పార్టీ కమిటీకి సంబంధించి ప్రతి నియోజకవర్గం నుంచి ఒక ఉపాధ్యక్షులు, ఇద్దరు ఆర్గనైజింగ్ సెక్రటరీలు, ఇద్దరు యాక్టివిటీ సెక్రటరీ, ఒక అధికార ప్రతినిధి పేర్లను పంపవలసినదిగా నియోజకవర్గాల సమన్వయకర్తలను ఆయన కోరారు. 26 జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులను కూడా త్వరలో నియమిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు చంద్రగిరి ఏసురత్నం, మురుగుడు హనుమంతరావు, నియోజకవ్గం సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, షేక్ నూరి ఫాతిమా, దొంతిరెడ్డి శంకర్ రెడ్డి (వేమారెడ్డి), వనమా బాల వజ్రబాబు, బాలసాని కిరణ్ కుమార్, గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్ నిమ్మకాలయ రాజనారాయణ పాల్గొన్నారు.
గ్రామ, పట్టణ స్థాయిలో పార్టీ కొత్త కమిటీలు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు
Comments
Please login to add a commentAdd a comment