ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
బాపట్లటౌన్: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ వెంకట మురళి మాట్లాడుతూ దివ్యాంగులు క్యూలో నిలబడి ఇబ్బందులు పడకుండా వారి కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహిస్తామన్నారు. ప్రతి నెల మూడో శుక్రవారం ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్లో గ్రీవెన్స్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అలాగే ప్రతి నెలా నాలుగో శుక్రవారం కేవలం ఎస్టీల కోసం మాత్రమే గ్రీవెన్స్ నిర్వహిస్తామన్నారు. దివ్యాంగులు, గిరిజనుల సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా అధికారులంతా హాజరు కావాలన్నారు. అదే రోజు మండల స్థాయి, డివిజన్ స్థాయి అధికారులంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులో ఉండాలన్నారు. అర్జీలను సాధ్యమైనంత త్వరగా అధికారులు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్దేశిత గడువులోపు అర్జీలు పరిష్కరించాలన్నారు. ఆధార్ కార్డులు లేని ఎస్టీల సర్వే మరింత పక్కాగా నిర్వహించాలన్నారు. చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద తోపుడుబండ్లపై వ్యాపారం చేసుకుంటున్న 18 నక్కల కుటుంబాల జీవనోపాధికి ఆటంకం కలిగించవద్దని, వారికి రాత్రుళ్లు ఆశ్రయం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్, ఆర్డీవో పి.గ్లోరియా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రతి నెలా 3వ శుక్రవారం దివ్యాంగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ 4వ శుక్రవారం ఎస్టీల కోసం.. అధికారుల సమీక్షలో కలెక్టర్ వెంకట మురళి
Comments
Please login to add a commentAdd a comment