బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Published Tue, Nov 19 2024 2:30 AM | Last Updated on Tue, Nov 19 2024 2:30 AM

బాపట్

బాపట్ల

మంగళవారం శ్రీ 19 శ్రీ నవంబర్‌ శ్రీ 2024

7

కార్తిక పూజలు

చుండూరు(వేమూరు): చుండూరు మండలం చినపరిమిలోని రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో కార్తిక సోమవారం పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఆందోళన

బాపట్ల టౌన్‌: గిరిజన బిడ్డల అభ్యున్నతి కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్న తమపై ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందని గిరిజన సంక్షేమ గురుకులం అవుట్‌ సోర్సింగ్‌ యూనియన్‌ అధ్యక్షులు ఎన్‌.పర్మేష్‌ తెలిపారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టర్‌ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. పర్మేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యావ్యవస్థలో ఎక్కడా కూడా ఔట్‌సోర్సింగ్‌ విధానంలో ఉపాధ్యాయులు లేరని, గిరిజన సంక్షేమ శాఖలో మాత్రమే ఉన్నారని తెలిపారు. చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్స్‌గా మార్పు చేసి 2022 పీఆర్సీ ప్రకారం జీతభత్యాలు చెల్లించాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు జె. రామాంజనేయులు, సీహెచ్‌. ఏడుకొండలు, టి. చంటి, ఎ. రాజు పాల్గొన్నారు.

యార్డుకు 43,853

బస్తాల మిర్చి

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డుకు సోమవారం 43,853 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్‌ విధానం ద్వారా 38,919 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్‌ ఏసీ కామన్‌ రకం 334, నంబర్‌–5, 273, 341, 4884, సూపర్‌–10 రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి రూ. 14,500 వరకు పలికింది. నాన్‌ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్‌ రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి 16,700 వరకు లభించింది. ఏసీ కామన్‌ రకం మిర్చి రూ. 8,000 నుంచి రూ. 15,500 వరకు లభించింది. ఏసీ ప్రత్యేక రకం రూ. 8,500 నుంచి రూ. 16,500 వరకు ధర పలికింది.

సాక్షి ప్రతినిధి,బాపట్ల: చిరుద్యోగులపై కూటమి సర్కారు కత్తిగట్టింది. పార్టీ ముద్రవేసి తొలగింపులు దిగుతోంది. కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఫలితంగా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో ఇటీవల 173 మందికిపైగా వీవోఏ(విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌)లను సర్కారు నిర్ధాక్షిణ్యంగా తొలగించింది. దీంతో వీవోఏలు జె.పంగులూరు వెలుగు కార్యాలయం వద్ద ఇటీవల 24 గంటల నిరసన దీక్ష చేపట్టారు. పొదుపు సంఘాల మహిళల పద్దులు రాయడం, ప్రభుత్వం ఇచ్చే పథకాలను తెలియచేయడం, బ్యాంకులనుంచి రుణాలు ఇప్పించడం, చెల్లింపుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయడం వీవోఏల విధి. ఇంతా చేసినా వారికి నెలకు అందేది రూ.8వేలు మాత్రమే. అయినా ఈ చిరుద్యోగులపై టీడీపీ నేతలకు కన్నుకుట్టింది. పార్టీ ముద్రవేసి ఇప్పటికే చాలామందిని తొలగించారు. మరికొందరిని తొలగించేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ నేతలు చెప్పిందే తడవుగా వెలుగు కార్యాలయాల్లో పనిచేస్తున్న ఏపీఓలు వీవోఏలను తొలగిస్తున్నారు.

వీవోఏలపై జగన్‌ ప్రభుత్వం సానుకూలత

పదేళ్లకుపైగా వీవోఏలు ఉద్యోగాలు చేసుకుంటున్నా వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వారి జోలికెళ్లలేదు. వారిని ఏ పార్టీ అని అడగలేదు. తమ పార్టీ కాదని ఉద్యోగం నుంచి తొలగించలేదు. తప్పులు జరిగిన చోట్ల ఒకరిద్దరిని మాత్రమే తొలగించిన ఘటనలు ఉన్నాయి తప్పించి పార్టీలు చూసి ఉద్యోగాలు పీకేసిన పరిస్థితి లేదని వీవోఏలే పేర్కొంటుడడం గమనార్హం. పైగా వారి సంక్షేమానికి గత సర్కారు కృషి చేసింది.

మొత్తం 1,031 మంది వీవోఏలు

జిల్లాలో 33,374 డ్వాక్రా గ్రూపులు ఉండగా వీటి పరిధిలో 1,031 మంది వీవోఏలు పనిచేస్తున్నారు. ఎక్కువమంది 2013 నుంచి ఇప్పటివరకూ విధుల్లో ఉన్నారు. తమ పని తాము చేసుకుంటున్నారు. లక్షలాదిమంది మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారు. కూటమి సర్కారు వచ్చినప్పటి నుంచే వీరిపై కక్షకట్టింది. విధుల నుంచి తొలగిస్తోంది.

కూటమి నేతలు చెబితే సరి!

కూటమి నేతలు చెబితే తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ఏపీవోలు చెబుతున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని వీవోఏలు ధ్రువీకరిస్తున్నారు. ధ్రువీకరిస్తున్నారు.

జె. పంగులూరు వెలుగు కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టిన వీవోఏలు (ఫైల్‌)

న్యూస్‌రీల్‌

జిల్లాలో 173 మందికిపైగా వీవోఏల తొలగింపు పదేళ్లుగా ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళలు కూటమి అధికారంలోకి రాగానే పార్టీ ముద్రవేసి కక్షసాధింపులు మంత్రుల నియోజకవర్గాల్లోనే అత్యధిక ఉద్యోగాల తీసివేతలు చిరుద్యోగుల సంక్షేమానికి వైఎస్‌ జగన్‌ సర్కారు కృషి

వీవోఏల ఆవేదన

2014 నుంచి పనిచేస్తున్న అద్దంకి మండలం కలువకూరుకు చెందిన స్వాతిని ఇటీవల తొలగించారు. ఎటువంటి ఫిర్యాదులూ లేకుండా ఉద్యోగం నుంచి ఎలా తొలగిస్తారంటూ ఆమె ప్రశ్నిస్తోంది. కేవలం రాజకీయంగా స్థానికుల ఫిర్యాదు తీసుకొని అధికారులు తొలగించడం సరికాదని అద్దంకి మండలానికి చెందిన శారద, బల్లికురవ మండలం వేమవరానికి చెందిన భవాగ్ని, జె.పంగులూరు మండలం కొండమూరుకు చెందిన సావిత్రి, ఇదే మండలానికి చెందిన హేమతోపాటు పలువురు వీవోఏలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇటీవల జె.పంగులూరు మండలంలో వీవోఏలు ఆందోళన బాటపట్టి పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా తొలగించబడిన వీవోఏలందరూ ఏకమై కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు సిద్ధపడుతున్నట్టు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
బాపట్ల1
1/7

బాపట్ల

బాపట్ల2
2/7

బాపట్ల

బాపట్ల3
3/7

బాపట్ల

బాపట్ల4
4/7

బాపట్ల

బాపట్ల5
5/7

బాపట్ల

బాపట్ల6
6/7

బాపట్ల

బాపట్ల7
7/7

బాపట్ల

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement