మంత్రి గొట్టిపాటి ఇలాకాలో 51 మంది తొలగింపు | - | Sakshi
Sakshi News home page

మంత్రి గొట్టిపాటి ఇలాకాలో 51 మంది తొలగింపు

Published Tue, Nov 19 2024 2:31 AM | Last Updated on Tue, Nov 19 2024 2:30 AM

మంత్రి గొట్టిపాటి ఇలాకాలో 51 మంది తొలగింపు

మంత్రి గొట్టిపాటి ఇలాకాలో 51 మంది తొలగింపు

విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న అద్దంకి నియోజకవర్గంలో అత్యధికంగా 51 మంది వీవోఏలను తొలగించారు. జె.పంగులూరు మండంలో మొత్తం 38 మందికి గాను ఇప్పటివరకూ 18 మందిని తొలగించగా అద్దంకి, సంతమాగులూరు మండలాల్లో తొమ్మిది మంది చొప్పున 18 మందిని, మేదరమెట్లలో 8 , బల్లికురవలో 7 మందిని తొలగించారు.

● అలాగే రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ నియోజకవర్గం రేపల్లెలో నగరం మండలంలో 18 మందిని, నిజాంపట్నంలో 11, చెరకుపల్లిలో 13, రేపల్లెలో 7గురిని మొత్తం 49 మందిని తొలగించారు.

● పర్చూరు నియోజకవర్గంలో మార్టూరులో 11 మందిని, యద్దనపూడిలో 9, పర్చూరు 7, చినగంజాం 6,ఇంకొల్లులో 6, కారంచేడులో నలుగురిని మొత్తం 43 మందిని తొలగించారు.

● మాజీమంత్రి నక్కా ఆనందబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న వేమూరు నియోజకవర్గంలో చుండూరు మండలంలో 12 మందిని, భట్టిప్రోలు 7, కొల్లూరు 6, వేమూరు 4, అమృతలూరులో ఒకరిని మొత్తం 36 మందిని తొలగించారు.

● చీరాల, బాపట్ల తదితర ప్రాంతాల్లోనూ కొందమందిని తొలగించినట్లు తెలుస్తున్నా వెలుగు అధికారులు సమాచారం చెప్పడానికి నిరాకరిస్తున్నారు. అసలు జిల్లాలో ఎంతమందిని తొలగించారో అన్న సమాచారం తమ దగ్గర ఉండదని వెలుగు జిల్లా అధికారులు చెప్పడం గమనార్హం. విధుల్లో నుంచి తొలగించడంతో పలువురు వీవోఏలు కోర్టునూ అశ్రయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement