ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం
బాపట్ల టౌన్: సమస్యలతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ తుషార్‌డూడీ అధికారులకు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 33 మంది బాధితులు హాజరయ్యారు. నేరుగా ఎస్పీని కలిసి సమస్యలు విన్నవించుకున్నారు. ఆయన జిల్లాలోని పోలీస్ అధికారులతో మాట్లాడారు. బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీ మోసాలు తదితర సమస్యలతో కూడిన అర్జీలు అధికంగా ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్, పీజీఆర్ఎస్ ఇన్చార్జి సీఐ శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ తుషార్ డూడీ
Comments
Please login to add a commentAdd a comment