విస్తృత తనిఖీలు చేపట్టాలి | Sakshi
Sakshi News home page

విస్తృత తనిఖీలు చేపట్టాలి

Published Fri, May 10 2024 6:40 PM

విస్తృత తనిఖీలు చేపట్టాలి

కరకగూడెం: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో విస్తృత తనిఖీలు చేపట్టాలని మహబూబాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల వ్యయ పరిశీలకులు రామ్‌ కుమార్‌ గోపాల్‌ సూచించారు. గురువారం ఆయన పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం క్రాస్‌రోడ్‌ వద్ద గల చెక్‌ పోస్టును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మద్యం, నగదుపై తరలింపుపై నిరంతర నిఘా పెట్టాలని ఆదేశించారు. అనంతరం పలు వాహనాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌టీ అధికారి కొమరం లక్ష్మణ్‌ రావ్‌, సివిల్‌ పోలీస్‌ కెప్టెన్‌ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement