ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు
దుమ్ముగూడెం : భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుకు వ్యతిరేకంగా మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఫ్లెక్సీలు వెలిశాయి. ఇందిరమ్మ కమిటీల్లో అసలైన కాంగ్రెస్ వాదులకు చోటు కల్పించకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం కల్పించారంటూ ఫ్లెక్సీల్లో కార్టూన్ రూపంలో చిత్రాలు ముద్రించారు. ఈ ఫ్లెక్సీలను కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం వారు ఏర్పాటు చేశారనే ప్రచారం సాగుతోంది. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటులో నిజమైన కాంగ్రెస్ వాదులకు చోటు కల్పించలేదంటూ రెండు రోజుల క్రితం డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి చైర్మన్ పొదెం వీరయ్యకు మండల కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. కాగా, ఎమ్మెల్యే వెంకట్రావు సొంత మండలంలోనే ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటుకావడం గమనార్హం.
ఇందిరమ్మ కమిటీల నియామకాలపై కాంగ్రెస్ వాదుల అసంతృప్తి
Comments
Please login to add a commentAdd a comment