సర్వే సమర్థవంతంగా నిర్వహించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 6 నుంచి చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. సర్వే చేయాల్సిన తీరుపై జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, మండల స్టాటిస్టికల్ అధికారులు, ప్రత్యేకాధికారులు, మున్సిపల్ కమిషనర్లకు బుధవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టే ఈ కార్యక్రమం లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకొస్తుందని, అధికారులు వివరాలను సేకరించే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు. సర్వేలో ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాలు సేకరించాలని సూచించారు. ప్రజల జీవనస్థితిగతులను తెలుసుకునేందుకే ప్రభుత్వం ఈ సర్వే చేపడుతుందని చెప్పారు. ప్రజాసమస్యలు తెలుసుకుని పరిష్కారాలు గుర్తించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సర్వే పూర్తయిన తర్వాత వివరాలు నింపిన స్టిక్కర్‌ను ఇంటి గోడపై అతికించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు వేణుగోపాల్, విద్యాచందన, జెడ్పీ సీఈఓ చంద్రశేఖర్, సీపీఓ సంజీవరావు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్
Comments
Please login to add a commentAdd a comment