నేడు బీసీ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ
ఖమ్మం సహకారనగర్: బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం ఖమ్మం కలెక్టరేట్‌లో మంగళవారం ఉదయం 10గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన రాజకీయ పార్టీలు, సంఘాల నాయకులు, ప్రజలు బీసీ వర్గాలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో అవసరమైన రిజర్వేషన్ల దామాషాపై అభిప్రాయాలు తెలియచేయొచ్చని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఆరు సెట్ల పత్రాలను వెరిఫికేషన్ అఫిడవిట్‌తో పాటు రూ.20 నాన్ జ్యూడీషియల్ స్టాంపు పేపర్‌పై తెలుగు లేదా ఆంగ్ల భాషల్లో ఇవ్వాల్సి ఇవ్వాలని సూచించారు.
చిన్నారి చికిత్సకు
ఆర్థిక సాయం
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని ఏఎస్‌ఆర్ కాలనీకి చెందిన రాధ అనే మహిళకు పుట్టిన పాప అనారోగ్యానికి గురి కాగా వైద్య ఖర్చుల కోసం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సోమవారం ఆర్థిక సాయం అందించారు. చిన్నారి పుట్టినప్పటి నుంచి నిమ్ముతో బాధపడుతోందనే విషయం తెలియగానే ఐటీడీఏ రిలీఫ్ ఫండ్ నుంచి రూ 25 వేల చెక్కు తల్లి రాధకు అందజేశారు.
సంస్థ ఆస్తుల పరిరక్షణకు పాటుపడాలి
సింగరేణి(కొత్తగూడెం): శిక్షణలో నేర్చుకున్న ప్రతీ అంశాన్ని విధి నిర్వహణలో అమలుచేస్తూ సింగరేణి ఆస్తులను కాపాడాలని జనరల్ మేనేజర్(సెక్యూరిటీ) సీహెచ్.లక్ష్మీనారాయణ సూచించారు. కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా పరిధి ఎస్ అండ్ పీసీ సెంటర్‌లో సెక్యూరిటీ సిబ్బంది శిక్షణ తరగతులను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సెక్యూరిటీ సిబ్బంది వృత్తి నైపుణ్యంతో విధులు నిర్వర్తించేలా శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. గనులు, డిపార్ట్‌మెంట్లతో పాటు అన్ని ఏరియాల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు సంస్థ ఆస్తుల పరిరక్షణను బాధ్యతగా భావించాలని సూచించారు. ట్రైనింగ్ ఆఫీసర్ జాకీర్ హుస్సేన్ మాట్లాడగా జీఎంను ఉద్యోగులు సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment