![మెరుగైన వైద్య సేవలందించాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05kgm274-192025_mr-1738781139-0.jpg.webp?itok=rlhEt8zX)
మెరుగైన వైద్య సేవలందించాలి
వైద్య సిబ్బందికి కలెక్టర్ ఆదేశం
పాల్వంచ: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. మందులు అందించే గది, రక్త పరీక్ష కేంద్రం, ఇన్ పేషెంట్ వార్డు, గర్భిణుల వార్డులను పరిశీలించారు. ఇన్ పేషెంట్లతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఓపీ, సిబ్బంది వివరాలు, మందుల నిల్వలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని, ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అవసరమైన మందులు సరిపడా నిల్వ పెట్టుకోవాలని చెప్పారు. వివిధ రకాల జబ్బులతో ఆస్పత్రికి వచ్చే బాధితులకు శుచికరమైన, బలవర్థకమైన ఆహారం అందించాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ రాంప్రసాద్, వైద్యులు శైలేష్, మోహన్ వంశీ, రాంప్రసాద్, లావణ్య, నర్సింగ్ సూపరింటెండెంట్ సరళ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment