![భారీగా పెరగనున్న పల్లె ఓటర్లు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05kgm395-192029_mr-1738781140-0.jpg.webp?itok=83y3MHYW)
భారీగా పెరగనున్న పల్లె ఓటర్లు
చుంచుపల్లి: జిల్లాలో పల్లె ఓటర్ల సంఖ్య భారీగా పెరగనుంది. పంచాయతీ ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు ఇటీవల ఈసీ మరో అవకాశం కల్పించింది. గతేడాది సెప్టెంబర్ 28న ప్రకటించిన పంచాయతీ ఓటర్ల తుది జాబితా ప్రకారం జిల్లాలో 6,33,947 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత మరోసారి ఓటర్ల చేర్పులకు దరఖాస్తులు స్వీకరించి జనవరి 6న తుది జాబితాను పంచాయతీలకు పంపించారు. వాటిపై కూడా అభ్యంతరాలు స్వీకరించి ఈనెల 7న పంచాయతీ ఓటర్ల తుది జాబితాను ప్రచురించేందుకు ఏర్పాట్లు చేశారు. కొత్తగా రూపొందించిన జాబితా ప్రకారం జిల్లాలో మరో 4, 5 వేల మంది ఓటర్లు పెరగనున్నారని అధికారులు తెలిపారు. ఇవి కాకుండా గతంలో పరిగణనలోకి తీసుకోని భద్రాచలంలో 41,008 మంది ఓటర్లు, సారపాకలో 19,044 మంది ఓటర్లు సైతం తుది జాబితాలో చేరనున్నారు. దీంతో జిల్లాలో దాదాపు 64 వేలకు పైగా పల్లె ఓటర్లు పెరగనున్నారు. ఇక అశ్వారావుపేటలో మూడు గ్రామాలు తగ్గడంతో మొత్తం 478 జీపీల తుది జాబితాను అధికారులు శుక్రవారం వెల్లడిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment