![ముగిసిన వాగ్గేయకారోత్సవాలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05bcm02-192041_mr-1738781140-0.jpg.webp?itok=BEN7yTPs)
ముగిసిన వాగ్గేయకారోత్సవాలు
ఐదు రోజుల పాటు భద్రగిరిలో
సంగీత హోరు
భద్రాచలం: భక్త రామదాసు జయంత్యుత్సవాల సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న వాగ్గేయకారోత్సవాలు బుధవారం ముగిశాయి. పలువురు సంగీత కళాకారులతో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు వీనులవిందుగా సాగాయి. చివరి రోజు బుధవారం ఉదయం సీహెచ్ వెంకటనారాయణ చేసిన వేణుగానం, శ్రీనిధి, నల్లాన్ చక్రవర్తుల పార్థసారధి, డి.వి.మోహన్ కృష్ణ బృందం ఆలపించిన దేశీయ సంగీతం అందరినీ ఆకట్టుకున్నాయి.
రామయ్యకు స్నపన తిరుమంజనం..
దేవస్థానంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఉత్తవ మూర్తులకు బుధవారం స్నపన తిరుమంజనం జరిపారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment