![Airtel Xstream Premium Announced With 15 OTT Services - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/10/airtel-xstream.jpg.webp?itok=eDTYBmdC)
ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ మొబైల్ నెట్‌వర్క్ సేవలతో పాటుగా ఓటీటీ సేవలను అందించేందుకు సిద్దమైంది. కొత్తగా ఎయిర్‌టెల్ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియంను ప్రారంభించింది. టాటా స్కై బింజీ తరహాలో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బండిల్ ఓటీటీ సేవలను ఎయిర్‌టెల్ యూజర్లకు అందించనుంది.
నెలకు రూ. 149, వార్షిక ప్లాన్ రూ. 1499
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియంతో యూజర్లుఒకే యాప్‌లో 15 విభిన్న ఓటీటీ సేవలను యాక్సెస్ చేయవచ్చును. ఇది ఎయిర్‌టెల్ కస్టమర్లకు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది.Airtel Xstream ప్రీమియం నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ధర రూ. 149 ఉండగా వార్షిక సభ్యత్వం రూ. 1,499గా లభించనుంది. ఒక వేళ ఆయా యూజర్ వార్షిక సభ్యత్వాన్ని తీసుకున్నట్లయితే ఈ విభిన్నమైన 15 రకాల ఓటీటీ సేవలు నెలకు కేవలం రూ. 125కే రానున్నాయి. ఇది ఒకే యాప్, ఒకే సబ్‌స్క్రిప్షన్, సింగిల్ సైన్-ఇన్‌ను మాత్రమే ఆలో చేయనుంది. Airtel Xstream ప్రీమియం సేవలను మొబైల్స్, టాబ్లెట్స్, ల్యాప్‌టాప్స్‌లో లేదా వెబ్‌తో పాటుగా టీవీలో Xstream సెట్-టాప్-బాక్స్ ద్వారా ఓటీటీ సేవలను పొందవచ్చును. గతంలో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సేవలను బెటా వెర్షన్‌లో ప్రయోగించింది. ఆ సయయంలో ఆయా యూజర్లకు ఏడాది గాను రూ. 499 చెల్లిస్తే ఓటీటీ సేవలను అందించింది.
15 రకాల ఓటీటీ సేవలతో పాటుగా..!
Airtel Xstream ప్రీమియం సేవల్లో భాగంగా యూజర్లు 15 రకాల ఓటీటీ సేవలను పొందవచ్చును. SonyLIV, ErosNow, Lionsgate Play, Hoichoi, ManoramaMax, Shemaroo, Ultra, HungamaPlay, EPICon, Docubay, DivoTV, Klikk, Nammaflix, Dollywood, Shorts TV వంటి ఓటీటీ సేవలను పొందవచ్చును. వీటితో పాటుగా సుమారు 10,500 సినిమాలు, షోస్, లైవ్ ఛానల్స్‌ను అందించనుంది. సమీప భవిష్యత్తులో మరిన్ని ఓటీటీ సేవలను జోడిస్తానని ఎయిర్‌టెల్ వాగ్దానం చేస్తోంది.
చదవండి: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కన్నుపడింది!!వందల కోట్ల పెట్టుబడులు షురూ!
Comments
Please login to add a commentAdd a comment