చెన్నై: అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం మధ్యలోనూ భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉండగలదని బహుళజాతి ఆటోమొబైల్ దిగ్గజం స్టెలాంటిస్ సీఈవో కార్లోస్ టవారెస్ చెప్పారు. గణనీయ వృద్ధి సాధించేందుకు, ’సూపర్‌పవర్’గా ఎదిగేందుకు భారత్‌కు పుష్కలమైన సామర్థ్యాలు ఉన్నాయని ఆయన తెలిపారు. పాశ్చాత్య దేశాలు (అమెరికా, యూరప్) – చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో అవకాశాలను అందిపుచ్చుకోగలదని చెప్పారు. ‘2023లో అంతర్జాతీయ ఎకానమీ మందగించబోతోందని అందరూ భావిస్తున్నారు.
ఇలాంటప్పుడు కూడా భారత్ 6–7 శాతం వృద్ధి సాధించగలదని అంచనా వేస్తున్నారు. ఇది కచ్చితంగా చాలా అధిక వృద్ధిగానే భావించవచ్చు‘ అని కార్లోస్ వివరించారు. ఒకవేళ దేశీయంగా ఆటోమోటివ్ మార్కెట్ కొంత మందగించినా తాము సమర్ధమంతమైన వ్యయ నియంత్రణ చర్యలు పాటిస్తుండటం వల్ల తమ కార్యకలాపాలపై పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండబోదని ధీమా వ్యక్తం చేశారు. తమ కాంపాక్ట్ కార్ సీ3 ఎలక్ట్రిక్ వెర్షన్‌ను భారత మార్కెట్లో వచ్చే ఏడాది తొలి నాళ్లలో ప్రవేశపెట్టనున్నట్లు కార్లోస్ చెప్పారు. నాణ్యమైన ఎలక్ట్రిక్ వాహనాలను చౌకగా అందించేందుకు వ్యయాల తగ్గింపుపై మరింతగా కసరత్తు చేస్తున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment