ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. గత వారం భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. ఇంకా, ఇన్వెస్టర్లలో ఒమిక్రాన్ భయాలు విడకపోవడంతో భారీగా నష్టపోయాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ప్రపంచ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలతో నేడు నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లకు ఊరటనిచ్చే అంశాలేవీ లేకపోవడంతో పాటు ఒమిక్రాన్ కేసుల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలతో సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. యూరోప్ దేశాల్లో మరోమారు లాక్‌డౌన్ విధించే అవకాశాలు ఉండటంతో మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి.
చివరకు, సెన్సెక్స్ 1,189.73 పాయింట్లు (2.09%) క్షీణించి 55,822.01 వద్ద నిలిస్తే, నిఫ్టీ 371.00 పాయింట్లు (2.18%) కోల్పోయి 16,614.20 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.92 వద్ద ఉంది. నిఫ్టీలో భారీగా నష్టపోయిన వాటిలో బీపీసీఎల్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు ఉన్నాయి. ఎక్కువ లాభపడిన వాటిలో సిప్లా, హెచ్‌యుఎల్, డాక్టర్ రెడ్డిస్ కంపెనీలు ఉన్నాయి. రియాల్టీ, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, మెటల్ సూచీలు 3-4 శాతం పడిపోవడంతో నష్టాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 3 శాతానికి పైగా పడిపోయాయి.
(చదవండి: ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొన్నారా.. అయితే, వెంటనే షోరూమ్ తీసుకెళ్లండి!)
Comments
Please login to add a commentAdd a comment