దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ స్వల్ప నష్టంతో 10.52 పాయింట్లు లేదా 0.013% కోల్పోయి 79,914.26 వద్ద సెషన్‌ను ముగించింది. అదే సమయంలో నిఫ్టీ మాత్రం 24,300 మార్క్‌ను నిలబెట్టుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 12.70 పాయింట్లు లేదా 0.052% లాభపడి 24,337.15 వద్ద నిలిచింది.
ఓఎన్‌జీసీ, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఐటీసీ, టాటా మోటర్స్ షేర్లు మంచి లాభాలతో టాప్‌గెయినర్స్‌గా నిలిచాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా&మహీంద్రా, దివిస్ ల్యాబ్స్, ఎన్‌టీపీసీ టాప్ లూజర్స్ జాబితాలోకి చేరి నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment