దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం రికార్డు గరిష్టాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన బెంచ్‌మార్క్ సూచీలు ఊపందుకున్నాయి. ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, ఐటీసీ వంటి ఎంపిక చేసిన ఇండెక్స్ హెవీవెయిట్‌ల నేతృత్వంలోని మద్దతుతో ముగింపులో గరిష్ట స్థాయిలలో స్థిరపడ్డాయి.
షెషన్ ముగింపు సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 145 పాయింట్లు (0.2%) పెరిగింది. అదే సమయంలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 82 పాయింట్లు (0.3%) లాభపడింది.
ఓఎన్‌జీసి, ఎస్‌బీఐ, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఈరోజు టాప్ గెయినర్‌లలో ఉన్నాయి. మరోవైపు టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ ఈరోజు టాప్ లూజర్స్‌లో ఉన్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment