లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 391.26 పాయింట్ల లాభంతో 80,351.64 వద్ద, నిఫ్టీ 112.65 లాభంతో 24,433.20 వద్ద ముగిసాయి. నేడు స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ కూడా లాభాలను పొందాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా మారుతి సుజుకి, బోష్ (Bosch), పీఐ ఇండస్ట్రీస్, అపోలో టైర్స్, ఇప్కా లేబొరేటరీస్ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ మొదలైన కంపెనీలు ఉన్నాయి. బంధన్ బ్యాంక్ లిమిటెడ్, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఐఆర్సీటీసీ, చంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment