అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ టెస్లా సీఈవో, ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్‌తో సమావేశమయ్యారు . ఈ సమావేశం అనంతరం భారత్‌లో టెస్లా భవిష్యత్తు గురించి ఎలాన్ మస్క్ మాట్లాడారు.
Great conversation with @NarendraModi https://t.co/UYpRvNywHb
— Elon Musk (@elonmusk) June 21, 2023
భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశం మంచి కోసం ఆలోచిస్తున్నారని, దేశంలో కొత్త కంపెనీల ఏర్పాటుకు మద్దతుగా ఉండాలనుకుంటున్నారని చెప్పారు. అదే సమయంలో ఇది దేశానికి ప్రయోజనం చేకూర్చేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మోదీ భారత్‌కు ఆహ్వానించారా.. తాత్కాలిక ప్రణాళికలను ఆయనతో పంచుకున్నారా అని అడిగిన ప్రశ్నకు మస్క్ అవునని సమాధానమిచ్చారు. మోదీ తనను భారత్‌కు ఆహ్వానించారని, వచ్చే ఏడాది భారత్ సందర్శించే ప్రణాళిక ఉందని పేర్కొన్నారు.
ఈ ఏడాది చివరికల్లా..
భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటును ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ మాట్లాడుతూ భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని ఈ ఏడాది చివరికల్లా ఖరారు చేసే అవకాశం ఉందన్నారు. కాగా అమెరికాలో బిజినెస్ లీడర్లతో సమావేశం గురించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్‌కు ఎలాన్ మస్క్ స్పందించారు. మోదీని మరోసారి కలవడం గౌరవంగా ఉందంటూ రీట్వీట్ చేశారు.
It was an honor to meet again
— Elon Musk (@elonmusk) June 20, 2023
ఇదీ చదవండి: థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్: ఏ వాహనానికి ఎంతెంత? ప్రీమియం రేట్ల ప్రతిపాదనలు..
Comments
Please login to add a commentAdd a comment