– జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు
బైరెడ్డిపల్లె: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ మణికంఠ చందవోలు అన్నారు. బైరెడ్డిపల్లె పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది పనితీరు, వివిధ క్రైమ్ రికార్డులను క్షుణంగా పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసులు, కేసుల్లో అరెస్టు కాని నిందితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్‌సిబ్బందితో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు డూప్లికేట్ ఐడీ క్రియెట్ చేసి ప్రజలను మోసం చేసే అవకాశం ఉంటుందన్నారు. అధికంగా విజిబుల్ పోలీసింగ్ చేయాలని, సమర్థవంతమైన నేర నియంత్రణ, నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఏ సమస్య వచ్చినా ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసులేనని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సహాయం చేయాలన్నారు. హత్యలు, అత్యాచారాలు జరగకుండా ముందుగానే పసిగట్టి చర్యలు చేపట్టాలన్నారు. మహిళా పోలీసులు ఇంటింటికీ వెళ్లి మహిళలపై జరుగుతున్న నేరాలు, సైబర్ నేరాలు, యాప్‌ల ద్వారా మోసాలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వంటి నేరాలపై అవగాహన కల్పించాలన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పలమనేరు డీఎస్పీ ప్రభాకర్, పలమనేరు రూరల్ సీఐ మురళీ మోహన్, ఎస్‌ఐ పరుశురాముడు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment