మధుర జ్ఞాపకం..
హోరాహోరీగా సాఫ్ట్‌బాల్ పోటీలు
రాష్ట్రస్థాయి అండర్–14 సాఫ్ట్‌బాల్ టోర్నమెంటు పోటీలు రెండో రోజైన శనివారం కూడా హోరాహోరీగా సాగాయి.
సర్కారు బడుల్లో బోధన మెరుగ్గా ఉండాలి
ఉద్యోగాలకు 22 మంది ఎంపిక
ఆదివారం శ్రీ 24 శ్రీ నవంబర్ శ్రీ 2024
బెంగళూరులో జూనియర్ నేషనల్స్ ఖోఖో పోటీల్లో పాల్గొన్న సమయంలో క్రీడాకారులను పరిచయం చేస్తున్న బాలాజీ
వేదాలు తెలపని సత్యం.. శాస్త్రాలు పలకని ఆచారం.. కాలాలు మారిన చెదరని కావ్యం.. కవులు రాయలేని గ్రంథం బాల్యం.. చిన్ననాటి అల్లరి చేష్టలు.. గత స్మృతులు.. అలనాటి జ్ఞాపకాలు.. ఆ మధుర క్షణాలు ఎన్నటికీ మరువలేనివి.. మరపురానివి. అలాంటి అంతులేని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటుంటేనే మనసు పరవశించిపోతుంది. ఆ ఆనందాలను ఉన్నతస్థాయి అధికారులు గుర్తుతెచ్చుకున్నారు. ఆదివారం ప్రత్యేకంగా కొందరు అధికారుల బాల్యస్మృతులపై ప్రత్యేక కథనం.
నేడు రౌండ్–2
స్పెల్ బీ, మ్యాథ్స్ బీ
తిరుపతి ఎడ్యుకేషన్ : విద్యార్థుల్లో ఆంగ్లం, గణితం సబ్జెక్టుల్లో దాగున్న ప్రతిభను వెలికితీసేందుకు సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా స్పెల్ బీ, మ్యాథ్స్ బీ పరీక్షలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఇదివరకే నిర్వహించిన పాఠశాల స్థాయి (రౌండ్–1) స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీలో ప్రతిభ కనబరి చిన విద్యార్థులకు రెండో రౌండ్ పోటీలను ఆదివారం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తిరుపతి జీవకోనలోని విశ్వం విద్యాసంస్థలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు రౌండ్–2 పోటీలను నిర్వహించనున్నారు. స్పెల్‌బీ పరీక్షను నాలుగు కేటగిరీలుగా విభజించి విద్యార్థులకు పరీక్షను చేపట్టనున్నారు.
పకడ్బందీగా స్క్రీనింగ్ పరీక్షలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రస్తుతం చేస్తున్న పలు స్క్రీనింగ్ పరీక్షలు పకడ్బందీగా చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రభావతీదేవి అన్నారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో ఆమె శనివారం జిల్లా అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించా రు. క్యాన్సర్, స్కూల్ హెల్త్ స్క్రీనింగ్, స్కాన్స్ స్క్రీనింగ్, ఆర్‌బీఎస్‌కే స్క్రీనింగ్‌ను పక్కాగా నిర్వహించాలన్నారు. ప్రతి వైద్యాధికారి ఈ స్క్రీనింగ్ సర్వేను పర్యవేక్షించాలన్నారు. గర్భిణులకు అందించే సేవల్లో నిర్లక్ష్యం వద్దన్నారు.
కాణిపాకంలో భక్తుల రద్దీ
కాణిపాకం:శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానానికి శనివారం భక్తుల తాకిడి పెరిగింది. వేకువజాము నుంచి భక్తులు స్వామి దర్శనం కోసం క్యూకట్టారు. రాత్రి వరకు కూడా భక్తుల రద్దీ కొనసాగింది. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనంతోపాటు వీఐపీ దర్శన క్యూలైన్లు అన్నీ కిటకిటలాడాయి. .
సమస్యలన్నీ పరిష్కరిస్తాం
చిత్తూరు అర్బన్: సివిల్, ఏఆర్ పోలీసుల స మస్యలన్నింటినీ తప్పకుండా పరిష్కరిస్తామని చిత్తూరు ఏఎస్పీ (పరిపాలన) రాజశేఖరరాజు అన్నారు. శనివారం చిత్తూరులోని పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో ఏఆర్, ఎస్టీఫ్, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పోలీసులు తమ ఆర్యో గంతోపాటు కుటుంబంపై కూడా దృష్టి పెట్టాలన్నారు. సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను క్లియర్ చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. ఇంకా ఏవైనా సమస్యలుంటే తన దృష్టి కి తీసుకొస్తే, పరిష్కరిస్తామన్నారు. ఏఆర్ ఏ ఎస్పీ శివనంద కిషోర్, ఆర్‌ఐ సుధాకర్ పాల్గొన్నారు.
ఆ రోజులు.. మళ్లీ రావు
● చిన్ననాటి స్నేహాలు మరువలేనివి
●
● బాల్యంలో అంతే లేని ఆనందాలు
● పాతజ్ఞాపకాలను నెమరేసుకున్న అధికారులు
చిత్తూరు కలెక్టరేట్ : బాల్యం ఎవరికై నా, ఎప్పటికీ మరిచిపోలేని ఓ మధుర జ్ఞాపకం. ఎంత వయసొచ్చినా ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటే మళ్లీ ఆ రోజులు కళ్ల ముందు కదలాడుతాయి. పరిస్థితులు మారినా.. ఏళ్లు గడిచినా..అవకాశాలు మె రుగైనా ఎవరి చిన్నారి ప్రపంచం వారికి గొప్పగా కనిపిస్తుంది. ఓ పాతికేళ్లు వెనక్కి వెళితే అప్పటి పరిస్థితులన్నీ ఇప్పుడు మారిపోయాయి. ఆన్‌లైన్, సాంకేతిక పరిజ్ఞానం పెరిగి బోలెడన్ని అవకాశాలు పిల్ల ల చెంతకే చేరుతున్నాయి. గతంలో ఏదైనా ఆటల పోటీల్లో, ప్రతిభా పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో పాల్గొనాలంటే మహా నగరాల వరకు వెళ్లాల్సి వచ్చేది. సౌకర్యాలు అప్పట్లో అంతగా లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల వారు ప్రతిభ ఉన్నా అంత దూరం వెళ్లలేకపోయేవారు. గ్రామానికే పరిమితమయ్యేవారు. ప్రతి ఒక్కరికీ బాల్యం ఎంతో మధురమైనది. చిన్నప్పుడు చేసే చిలిపి పనులు, చిలిపి చేష్టలు మరపురాని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. ఎంత వయస్సు వచ్చినా.. గతం తాలుకూ గుర్తులు వెంటాడుతూనే ఉంటాయి. స్నేహితులతో కలిసి ఆడుకోవడం, సైకిల్ తొక్కడం, ఈతకు వెళ్లడం, తోటల్లో చిన్నచిన్న దొంగతనాలు చేయడం వంటివి అద్భుతమైన మధురజ్ఞాపకాలు. అవి నెమరేసుకుంటే అంతేలేని ఆనందం సొంతమవుతుంది. అల నాటి అవకాశాలను సద్వినియోగం చేసుకున్న ఎంతో మంది ప్రస్తుతం అధికారులుగా స్థిరపడ్డారు. వారిలో కొందరు అధికారుల బాల్య జ్ఞాపకాలివీ..
పొలాల బాట ఇప్పటికీ గుర్తుంది
వర్క్‌బుక్‌లో అక్షరాలు నేర్పారు
బొమ్మసముద్రం జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ శరత్‌చంద్ర
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని సర్కారు పాఠశాలల్లో బోధన మెరుగ్గా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ, సంక్షేమశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు అసెస్‌మెంట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో ఎంఈఓలు, తహసీల్దా ర్లు, ఎంపీడీఓలు కార్యక్రమాన్ని సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన జరుగుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచేలా మెరుగైన బోధన విధానం ఉండాలని ఆదేశించారు. బోధన విధానం పర్యవేక్షణలో విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ప్రతి ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల, హాస్టల్ విద్యార్థికి అసెస్‌మెంట్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు ఆహ్వానించి, కార్డులను అందించాలన్నారు. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయికి కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు. కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లు బాధ్యతను పాఠశాల స్థాయి లో హెచ్‌ఎంలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని చెప్పారు. పూర్వ విద్యార్థులను సైతం కార్యక్రమాలకు ఆహ్వానించాలని తెలిపారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ బాల స్వస్థ కింద విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో డీఆర్‌వో మోహన్‌కుమార్, డీఈఓ వరలక్ష్మి, సమగ్ర శిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణారెడ్డి, సాంఘీక సంక్షేమ శాఖ డీడీ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు కలెక్టరేట్ : వివిధ బహుళ జాతీయ కంపెనీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు 22 మంది అభ్యర్థులు ఎంపికై నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గుణశేఖర్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఉపాధి కల్పన కార్యాలయంలో శనివారం ఉద్యోగ మేళా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ మేళాలో 4 బహుళ జాతీయ కంపెనీలు పాల్గొన్నాయన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన 41 మంది అభ్యర్థులు హాజరుకాగా 22 మంది ఉద్యోగాలకు ఎంపికై నట్లు తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఏసీ ఇన్‌చార్జి విజయ్, అదనపు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఏకాంబరం, ఏపీఎస్‌ఎస్‌డీసీ జిల్లా ప్లేస్‌మెంట్ అధికారి చైతన్య తదితరులు పాల్గొన్నారు.
– 8లో
న్యూస్‌రీల్
జ్ఞాపకాలు మరువలేనివి
మాది పలమనేరు. నా బాల్యం అంతా పలమనేరులోనే సాగింది. చిన్నతనంలో చేసిన అల్లర్లు ఇ ప్పటికీ గుర్తున్నాయి. నేను పలమనేరు ప్రభుత్వ హై స్కూల్‌లో విద్యనభ్యసించాను. నేను ప్రస్తుతం ఇంటర్మీడియట్ డీవీఈఓగా ఉన్నప్పటికీ బాల్యంలో జరిగిన సంఘటనలను తరచూ మననం చేసుకుంటూనే ఉంటాను. అప్పట్లో స్నేహితులతో కలిసి తీసుకున్న చిత్రాలను చూస్తుంటే ఆ రోజులు మళ్లీ తిరిగి గుర్తుకొస్తుంటాయి. చిన్నతనంలో తల్లిదండ్రులు చెప్పిన మాటలు, వారి చెప్పిన జ్ఞాపకా లు, గురువుల బోధనతో నేను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాను. నాటి స్నేహితులమంతా ఏడాదికి ఒకసారైనా కలుస్తుంటాం. బాల్యం ఎప్పటికీ మరువలేని ఓ అందమైన జ్ఞాపకం. – సయ్యద్ మౌలా, డీవీఈఓ, జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు
మాది ఐరాల మండలం కుల్లంపల్లి. 1977లో మా గ్రామంలోని ప్రాథమి క పాఠశాలలోనే చదువుకున్నాను. ఆ తర్వాత మా గ్రా మం నుంచి 6 కిలోమీటర్ల దూరంలోని పైపల్లి జెడ్పీ హైస్కూల్‌కు నడుచుకుని వెళ్లేవాళ్లం. మా గ్రామంలోని 14 మంది టీమ్ గా పొలాల బాట నుంచి మాటలు చెప్పుకుంటూ హైస్కూల్‌కు వెళ్లే రోజులు ఎప్పటికీ మరిచిపోలేనివి. పోలాల బాటలో వెళ్లేటప్పుడు రైతులతో మా ట్లాడుకుంటూ వెళ్లేవాళ్లం. దారిలోని చెరుకు తోటలో చెరుకు, మామిడి తోటలో మామిడి కాయలను కోసుకుని స్నేహితులమంతా తినే వాళ్లం. అప్పట్లో టీచర్లు చదువుతోపాటు డ్రామాలు వేయించేవారు. విలువలు నేర్పించేవారు. నేను ఆ రోజుల్లో భువన విజయం నాటకంలో దూ ర్జటి వేషం వేశాను. ఆ జ్ఞాపకం మరిచిపోలేనిది. నాటి పొలం బాట ఇ ప్పటికీ గుర్తుంది. – శరత్ చంద్ర, ప్రిన్సిపల్, జూనియర్‌కాలేజీ,బొమ్మసముద్రం
మాది అనంతపురం, అమ్మ లక్ష్మీదేవి, నాన్న పెద్దకొండప్ప. నాన్న పోలీసుశాఖలో ఉద్యో గం మానేసి స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. కుటుంబ పో షణ కోసం సంగీత త రగతులు చెప్పడం, టైలరింగ్ పనులు చేసే వా రు. మాది పెద్దకుటుంబం అన్న, అక్కా, చెల్లెలు, తమ్ముడితో కలిపి మొత్తం 9 మంది పిల్లలం. డిగ్రీ వరకు సొంతవూరిలోనే చదివాను. అప్పట్లో వర్క్‌బుక్‌లో అక్షరాలు నేర్పారు. బాలికల పాఠశాలలో చదువుతున్నప్పుడు జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు గురువులు నేర్పించారు. సరళ, లలితమ్మ, శారద, రజీయా టీచర్లు హిందీ, అల్లికలు, సంగీతం, ఆటలు నేర్పించారు. ర న్నింగ్ రేస్, ఫుట్‌బాల్, వంటి ఆటలు బాగా ఆడేవాళ్లం. హిందుపురంలో నిర్వహించిన ఎన్‌సీసీ ట్రైనింగ్‌లో రైఫిల్ ఘాటింగ్‌లో మెడల్ వచ్చింది. అప్పట్లో విద్యతో పాటు క్రమశిక్షణను జీవితంలో భాగమని చెప్పేవారు. చిన్ననాటి స్నేహితులు సు జాత, విక్టోరియా, ఉమ ఇంకా టచ్‌లోనే ఉన్నా రు. అప్పట్లో వర్క్‌బుక్‌లో ఉపాధ్యాయులు అక్షరాలు నేర్పించారు. స్నేహితులతో కలిసి ఆటల్లో పోటీపడడం మరువలేని జ్ఞాపకాలు.
– పార్వతి, డీఎల్‌పీఓ, చిత్తూరు
Comments
Please login to add a commentAdd a comment