16న కలెక్టరేట్ వద్ద ధర్నా
చిత్తూరు కార్పొరేషన్: రైతులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 26వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. చిత్తూరులో శనివారం నిర్వహించిన సమావేశంలో కార్మిక సంఘాల జిల్లా నాయకులు నాగరాజు, సురేంద్రన్, సురేంద్రనాథ్ మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు. తప్పుడు నిర్ణయాలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక వర్గం సాధించుకున్న చట్టాలు, హక్కులను కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. పెరిగిన విద్యుత్ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నాకు రైతులు, కార్మికులు ,మహిళలు, విద్యార్థులు, దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. సమావేశంలో గోపీనాథ్, మంజునాథ్ బాబు, రామ్మూర్తి, మణి, చంద్ర, రమాదేవి, ఆర్ముగంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నలుగురు విద్యార్థినులకు అస్వస్థత
ఐరాల: మండలంలోని అగరంపల్లె జెడ్పీ హైస్కూల్ ఆరో తరగతికి చెందిన నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శనివారం సా యంత్రం పాఠశాల క్రీడామైదానంలో నిర్వహించిన పరుగు పందెంలో ఓ విద్యార్థిని అస్వస్థతకు గురై, పడిపోవడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వెంటనే 45 కొత్తపల్లె పీహెచ్‌సీకి తరలించారు. కొద్దిసేపటి తర్వాత మరో ముగ్గురు విద్యార్థినుల కూడా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఉపాధ్యాయులు 108 వాహనంలో నలుగురు విద్యార్థినులను జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు రక్తపరీక్షలు చేసి చైల్డ్ వార్డుకు తరలించారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఉపాధ్యాయులు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఎకై ్సజ్ దాడులు
చిత్తూరు అర్బన్: జిల్లాలో సారా, కర్ణాటక మద్యం విక్రయాలపై ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ శనివారం దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేసినట్లు ఆ శాఖ ఈఎస్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. పలమనేరు పరిధిలోని కీలపట్ల గ్రామంలో రెండు లీటర్ల సారా స్వాధీనం చేసు కుని ఓ నిందితుడ్ని అరెస్టు చేశారు. పుంగనూరులోని పూజగానిపల్లెలో 90 లీటర్ల సారా, నిందితడిని అరెస్టు చేయడంతోపాటు ఓ స్కూటర్ సీజ్ చేశారు. నగరిలోని అడవికొత్తూరులో మూడు వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, మూడు కేసులు నమోదు చేశారు. కార్వేటినగరంలోని తయ్యూరు గ్రామంలో ఓ కేసు నమోదు చేసి, 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడంతోపాటు 12 లీటర్ల సారాను సీజ్ చేశారు. చిత్తూరు అర్బన్ పరిధిలో ముగ్గురిపై కేసు నమోదు చేసి, 2400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామని ఎకై ్సజ్ సూపరింటెండ్ తెలిపారు. ఈ దాడుల్లో ఏఈఎస్ కృష్ణకిషోర్‌రెడ్డి, సుబ్రమణ్యం పలువురు సీఐలు పాల్గొన్నారు.
నేడు విద్యుత్
బిల్లుల చెల్లింపు సౌకర్యం
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారులు ఆదివారం కూడా బిల్లులు చెల్లించవచ్చని ట్రాన్స్‌కో జిల్లాల ఎస్‌ఈలు సురేంద్రనాయు డు, ఇస్మాయిల్‌అహ్మద్ తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రాలు ఆదివారం పనిచేస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment