డిసెంబర్‌లోపు రోడ్డు పనులు పూర్తి చేయండి
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా పంచాయతీరాజ్ (పీఆర్) పరిధిలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను డిసెంబర్‌లోపు పూర్తి చేయాలని ఆశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్‌సీ) బాలునాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం రోడ్డు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చిన ఆయన చిత్తూరులోని పంచాయతీరాజ్ ఎస్‌ఈ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో పరిధిలో ఎన్‌ఆర్‌జీఎస్ కింద 180 కిలోమీటర్ల సీసీ రోడ్లు రూ.78 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. దాదాపు 60 శాతం పైగా ప్రస్తుతం క్షేత్రస్థాయిలో చేశారన్నారు. జనవరి 15వ తేదీ లోపు మొత్తం పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. డిసెంబర్‌లోపు పనులు పూర్తి చేయాలని శాఖపరంగా లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. కొత్తగా 15 రోడ్లు, 8 బ్రిడ్జి పనులు చేపట్టడానికి అనుమతులు వచ్చాయన్నారు. వీటికి త్వరలో టెండర్లు పిలిచి పనుల అప్పగిస్తామన్నారు. పనుల ఖర్చు విషయంగా రాష్ట్రంలో రెండోస్థానంలో ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి, ఈఈ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అధికారి పర్యటనపై గోప్యత
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టామని చెప్పుకుంటున్న రోడ్డు పనులను పరిశీలించడానికి పంచాయతీరాజ్ రాష్ట్ర అధికారి బాలునాయక్ జిల్లా పర్యటనకు శనివారం వచ్చారు. శుక్రవారమే ఆయన పర్యటన ఖరారైనప్పటికీ పంచాయతీరాజ్ అధికారులు మీడియాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. క్షేత్రస్థాయిలో రోడ్డు పనులను పరిశీలిస్తారని తెలిసి కూడ వాటిని గోప్యంగా ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment