నాస్ సర్వేను విజయవంతం చేయాలి
అమలాపురం టౌన్: అభ్యాసనా సామర్థ్యాల స్థాయిని తెలుసుకునేందుకు చేపట్టే నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (నాస్)ను విజయవంతం చేయాలని డీఈవో ఎస్‌కే సలీమ్ బాషా సూచించారు. నాస్ సర్వే నిర్వహించేందుకు నియమించిన విద్యార్థులకు స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం పునశ్చరణ తరగతులు ప్రారంభమయ్యాయి. నాస్ ప్రారంభ కార్యక్రమంలో డీఈవో బాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ సర్వే ద్వారా విద్యార్ధుల్లో అభ్యాసన సామర్థ్యాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు వీలవుతుందన్నారు. ఈ సర్వేను ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు సమర్థంగా నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ సర్వే నిర్వహణకు థర్డ్ పార్టీగా ఫీల్డ్ ఇన్విస్టిగేటర్లను నియమించారని చెప్పారు. డీసీఈబీ సెక్రటరీ బి.హనుమంతరావు, సమగ్ర శిక్ష పీఎంవో పి.రాంబాబు మాట్లాడుతూ నాస్ సర్వేలో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన 104 పాఠశాలల్లోని 3, 6, 9 తరగతుల విద్యార్థులకు డిసెంబర్ 4న పరీక్ష నిర్వహిస్తారన్నారు. నాస్ సర్వే చేసే విధానంపై ఫీల్డ్ ఇన్విస్టిగేటర్లకు డిస్టిక్ లెవల్ మాస్టర్ ట్రైనీ సురేష్ జాన్‌బాబు శిక్షణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment