వరి కోతలు వాయిదా వేసుకోవాలి
అల్లవరం: తుపాను ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వరి కోతలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని రైతులకు జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో) వి.బోసుబాబు సూచించారు. అల్లవరం మండలం కోడూరుపాడులోని వరి మాసూలును బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరైనా వరి కోతలు చేస్తే రేపటి లోగా వరి పనలు ఒబ్బిడి చేసుకుని పంటను కాపాడుకోవాలని సూచించారు. కళ్లాల్లోని ధాన్యం రాశులపై బరకాలు కప్పాలని, వర్షాలు కురిస్తే ధాన్యం రాశులు తడిసిపోకుండా నీటిని పల్లానికి మళ్లించుకోవాలన్నారు. మండలంలోని 172 ఎకరాల్లో వరి కోతలు పూర్తియినట్టు తెలిపారు. తొలుత కోడూరుపాడులో పొలాలను వ్యవసాయాధికారి ఎన్‌వీవీ సత్యనారాయణతో కలసి తహసీల్దార్ వీవీఎల్ నరసింహరావు పరిశీలించారు. రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని పండిన పంటను కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విస్తరణాధికారి శుభ గణేష్, వ్యవసాయ సహాయకులు శ్రావణి, రైతులు కొక్కొరిమెట్టి తాతాజీ, సూరిబాబు, పిల్లా సూర్యనారాయణ, వాసంశెట్టి వెంకటేశ్వరరావు, కృష్ణమూర్తి, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment