అపార్ నమోదులో జిల్లా ప్రథమం
అయినవిల్లి: అపార్ ఐడీ నమోదు చేయడంలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా తెలిపారు. ఆయన బుధవారం ముక్తేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. అలాగే విద్యార్థులకు సైన్స్ సబ్జెక్టుపై ఉన్న పట్టును తెలుసుకున్నారు. పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఇటీవల చేసిన వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అపార్ ఐడీ నమోదు చేయడంలో జిల్లా 84 శాతంతో ప్రథమ స్థానంలో ఉందన్నారు. జిల్లాలో 2.48,000 మంది విద్యార్థులకు 2,06,516 మంది అపార్ ఐడీలు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం కొత్తగా 63 ఆధార్ శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. డిసెంబర్ 7వ తేదీన రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, ఆయాలు, వాచ్‌మెన్ల బిల్లులు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్నారు. వాటిని త్వరిత గతిన చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆయన వెంట సీఎంఓ బీవీవీ సుబ్రహ్మణ్యం, ఎంఈఓ–1 కె.వెంకటేశ్వరరావు, ఎంఈఓ–2 పి.శ్రీనివాసరావు ఉన్నారు.
బాలికల చదువుతోనే ప్రగతి
అమలాపురం టౌన్: సమాజంలో బాలికల చదువుతోనే ప్రగతి సాకారమవుతుందని డీఈవో ఎస్‌కే సలీమ్ బాషా అన్నారు. బాలికలకు వివాహ వయసు వచ్చిన తర్వాతే పెళ్లి చేయాలన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జన కల్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సహకారంతో బాల వివాహ్ ముక్త్ భారత్‌పై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరై డీఈవో మాట్లాడుతూ బాల్య వివాహాలను నిరోధించేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి.విజయకుమారి అధ్యక్షతన జరిగిన ఈ అవగాహన సదస్సులో డీవైఈవో గుబ్బల సూర్య ప్రకాశం, జన కళ్యాణ్ వెల్పేర్ సొసైటీ అధ్యక్షుడు ఎంఎస్‌ఆర్ కిషోర్ మాట్లాడారు. సమన్వయ కర్తగా ఉపాధ్యాయుడు ఎంఏకే భీమారావు వ్యవహరించారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి ఉమాలక్ష్మి, జిల్లా సర్వశిక్షా సీఎంవో బీవీవీ సుబ్రహ్మణ్యం, మండల లీగల్ సెల్ న్యాయవాది కేవీవీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
డీఈవో సలీం బాషా
ముక్తేశ్వరం ఉన్నత పాఠశాల పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment