ఏకసభ్య కమిషన్‌కు వినతులు
అమలాపురం టౌన్: ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిషన్‌కు గురువారం జిల్లాలోని 22 మండలాల నుంచి మాల నాయకులు తమ అభ్యంతరాలను వినతి పత్రాల రూపంలో తెలియజేశారు. కాకినాడ కలెక్టరేట్‌లో కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాను కలసి నాయకులు మాట్లాడారు. కులగణన చేపట్టిన తర్వాతే వర్గీకరణపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని సూచించారు. పార్లమెంట్‌లో మెజార్టీ, రాష్ట్రపతి ఆమోదంతో వర్గీకరణపై ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. అలాకాని పక్షంలో తాము ప్రజా ఉద్యమాల ద్వారా వర్గీకరణను అడ్డుకుంటామని జిల్లా దళిత ఐక్య వేదిక కన్వీనర్ జంగా బాబారావు, ప్రధాన కార్యదర్శి ఇసుకపట్ల రఘుబాబు స్పష్టం చేశారు. వర్గీకరణ అనేది మాల మాదిగలను విడదీసే రాజకీయ కుట్ర అని, ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిషన్ రాజ్యాంగ విరుద్దమని, దానిని రద్దు చేయాలని కమిషన్ ముందు తమ డిమాండ్‌ను వినిపించినట్టు వారు తెలిపారు. గొల్లపల్లి డేవిడ్‌రాజు, నెల్లి లక్ష్మీపతి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాల మహానాడు కన్వీనర్ చీకురుమిల్లి కిరణ్‌కుమార్ కమిషన్‌కు వినతి పత్రాలు అందించారు.
ఎస్సీ వర్గీకరణపై
వ్యతిరేకత వ్యక్తం చేసిన వైనం
జిల్లా నుంచి కాకినాడకు
తరలి వెళ్లిన మాల నేతలు
Comments
Please login to add a commentAdd a comment