కలెక్టర్ మహేష్ కుమార్
అమలాపురం రూరల్: ప్రభుత్వ ప్రాధాన్య అంశాలపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, ఇతర మండల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీడీఓలు తమ పరిధిలోని పాఠశాలలు, వసతి గృహాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో గుర్తించిన ఖాళీ స్థలాల్లో ఫల సాయాన్నిచ్చే పండ్ల మొక్కలను పెంచేందుకు అంచనాలను రూపొందించి జనవరి 10 నాటికి నివేదిక ఇవ్వాలన్నారు. నరేగా అనుసంధానంతో పంట కాలువలు, డ్రైన్లు గట్ల బలోపేతానికి చర్యలు చేపడుతూనే గట్లపై ఫల సాయాన్నిచ్చే మొక్కల పెంపకానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రానున్న పుష్కరాలకు సంబంధించి అన్ని డివిజన్ల పరిధిలో స్నాన ఘట్టాలు ఎలా ఉన్నాయో గుర్తించి, అభివృద్ధి పనులకు అంచనాలను రూపొందించాలన్నారు.
డైరీ ఆవిష్కరణ
జిల్లా పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో వివిధ సాంకేతిక అంశాలతో రూపొందించిన డైరీని కలెక్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ఉద్యోగులంతా కొత్త ఆశలు, ఆశయాలతో ఆనందంగా గడపాలని అన్నారు. జిల్లా పంచాయతీరాజ్ ఎస్‌ఈ పి.రామకృష్ణారెడ్డి, డివిజనల్ ఇంజినీర్లు అన్యం రాంబాబు, పీఎస్ రాజకుమార్, ఇంజినీరింగ్ సహాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment