మాజీ ఎంపీ అనురాధ నూతన సంవత్సర శుభాకాంక్షలు
అల్లవరం: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజలందరికి కొత్త ఏడాదిలో శుభం జరగాలని, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలను, భోగ భాగ్యాలను, అద్భుత విజయాలను ప్రసాదించాలని ఆ దైవాన్ని కోరుకుంటూ మాజీ ఎంపీ చింతా అనురాధ నూతన సంవత్సర శుభాకాంక్షలు మంగళవారం తెలియజేశారు. జిల్లాల్లో అన్ని రంగాలు అభివృద్ధి సాధించాలని, ప్రజలందరూ బాగుండాలని ఆమె తెలిపారు.
ఈవీఎం గోదాములకుపటిష్ట భద్రత
ముమ్మిడివరం: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్ గోదాములకు పటిష్ట భద్రత కల్పించాలని ఇన్‌చార్జి డీఆర్‌ఓ కె.మాధవి అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాల మూడో అంతస్తులో ఈవీఎం, వీవీప్యాట్ ఉంచిన గోదాములను, భద్రతకు సంబందించి చేపడుతున్న ఏర్పాట్లను రెవెన్యూ ,ఎన్నికల, అగ్నిమాపక అధికారులతో కలిసి తనిఖీ చేశారు. భభద్రతకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ మూడు నెలలకోసారి రాజకీయ ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం, వీవీప్యాట్ గోదాములను భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తనిఖీ చేస్తున్నామన్నారు. తనిఖీకి సంబంధించిన సమగ్ర నివేదికను ఎన్నికల సంఘానికి పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ఎస్.మురళీకృష్ణ, విద్యా వసతుల కల్పన డివిజనల్ ఇంజినీర్ ఎన్.సుబ్బరాజు, తహసీల్దార్ యు.సుబ్బలక్ష్మి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment