కోనసీమ స్నోబగులు
కోనసీమ స్నొబగులు
సాక్షి, అమలాపురం: అసలే కోనసీమ. పచ్చని పట్టుపరికిణీ కట్టినట్టు ఉంటుంది. ఈ అందం నిన్నటి మొన్నటి వరకు సాగిన సంక్రాంతి పండగకు కొత్త సొబగులు అద్దుకుంది. ఇప్పుడు మంచురూపంలో సరికొత్త అందాలు ఒలకబోస్తోంది. పచ్చని చేలు.. కొబ్బరి తోటలు.. కాలువలు.. గోదావరి నదీపాయ లు.. వాటిపై కప్పుకున్న మంచుదుప్పటి మైమరిచిపోయే అందాలను కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది. గడిచిన రెండు రోజులుగా జిల్లాలో ప్రకృతి ప్రియులను ఉల్లాసపరిచే పొగమంచు సోయగాలు కనువిందు చే స్తున్నాయి. మంచు తుంపర్లు వరి, కొబ్బరి చెట్లు, పలు రకాల ఇతర వృక్షాల ఆకులపై ముత్యాలుగా కొలువై కనువిందు చేస్తున్నాయి. ఆకుల చివర ఉన్న మంచు బిందువులపై పడిన లేతభానుడి కిరణాలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. చూసేందుకు రెండు కళ్లూ చాలని ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే తెల్లవారు జామునే దుప్పటి తొలగించి లేవాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment