ఇసుక, మట్టి తవ్వకాలపై కలెక్టర్‌కు సర్పంచ్ ఫిర్యాదు
పి.గన్నవరం: మండలంలోని యర్రంశెట్టివారిపాలెం, ఊడిమూడిలంక గ్రామాల్లో అక్రమంగా జరుగుతున్న ఇసుక, మట్టి తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బెల్లంపూడి సర్పంచ్ బండి మహలక్ష్మి మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ రెండు ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా రాత్రివేళల్లో సైతం అక్రమార్కులు పెద్దఎత్తున మట్టి, ఇసుకను తరలించుకు పోతున్నారని ఆమె వివరించారు. అక్రమార్కులు నదీగర్భాన్ని గుల్లచేస్తున్నా స్థానిక రెవెన్యూ అధికారులు గానీ, ఇతర శాఖల అధికారులుగానీ పట్టించుకోవడం లేదన్నారు. అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలన్నారు.
సంతృప్త స్థాయిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం
అమలాపురం రూరల్: అర్జీదారుల ఫిర్యాదులను సంతృప్త స్థాయి పరిష్కరించాలని పీజీఆర్‌ఎస్ జిల్లా నోడల్ అధికారి,డీఎల్‌డీఓ ఎస్. త్రినాథరావు అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ అమలు తీరు, సందేహాల నివృత్తిపై ఎంపీడీవోలు, ఈవోపీఆర్‌డీలు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ప్రజా సేవలు, పరిపాలన విధానాలకు సంబంధించిన ఫిర్యాదులకు నిబంధనలకు అనుగుణంగా పీజీఆర్‌ఎస్ ద్వారా పరిష్కార మార్గాలు పొందవచ్చునన్నా రు. సర్వీస్ రిక్వెస్ట్, వ్యక్తిగత కమ్యూనిటీ స్థా యి ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు. ప్రతిరోజు జిల్లా అధికారులు తమ లాగిన్ కు వచ్చిన ఫిర్యాదులపై స్పందించాలన్నారు. మొక్కుబడి పరిష్కారాలు చూపడంతో పథక ఆశయాలు నెరవేరడం లేదన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఎస్సీలు కృష్ణారెడ్డి, రా మకృష్ణారెడ్డి, డీపీఓ శాంతలక్ష్మి, డ్వామా పీడీ మధుసూదన్, డీల్‌డీవో ప్రభాకర్ పాల్గొన్నారు.
అయినవిల్లి విఘ్నేశ్వరునికి రూ.1,12,680 ఆదాయం
అయినవిల్లి: విఘ్నేశ్వర స్వామివారికి మంగళవారం ఒక్కరోజు వివిధ పూజ టిక్కెట్లు, ప్రసాదాలు, అన్నదాన విరాళాలు తదితర పూజల ద్వారా రూ.1,12,680 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. స్వామివారి ఆలయ ప్రధానార్చకులు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి లఘున్యాస అభిషేకాల్లో 12 మంది దంపతులు, స్వామి పరోక్ష అభిషేకాల్లో ఏడుగురు, గరిక పూజకు ముగ్గురు, లక్ష్మీ గణపతి హోమం ఆరుగురు దంపతులు నిర్వహించారు. స్వామివారి అన్న ప్రసాదం 1,635 మంది స్వీకరించారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా అడబాల
అమలాపురం రూరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా సీనియర్ నాయకులు అడబాల సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం అమలాపురం బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఎన్నికల అధికారి పాకా సత్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా ఎన్నికల అధికారి పెద్దిరెడ్డి రవికిరణ్, ఎన్నికల పరిశీలకులు ఏపీఆర్ చౌదరి పాల్గొని సత్యనారాయణ ఎన్నికై నట్లు ప్రకటించారు. ప్రస్తుత అధ్యక్షుడు యాళ్ల దొరబాబు నామినేషన్ వేసినప్పటికీ రాష్ట్ర నాయకులు అడబాను నియమించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. జాతీయ నాయకులు నల్లా పవన్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, రాష్ట్ర నాయకులు తమలంపూడి రామకృష్ణారెడ్డి అడబాలను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment