వాడపల్లి వెంకన్నకు రూ.1.47 కోట్ల ఆదాయం
కొత్తపేట: వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీల ద్వారా రూ 1,47,48,923 ఆదాయం వచ్చినట్టు దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. 40 రోజుల అనంతరం దేవదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో బుధవారం హుండీలను తెరిచి నగదు, మొక్కుబడులను లెక్కించారు. ప్రధాన హుండీల నుంచి 1,20,88,369, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ 22,38,344 సమకూరిందన్నారు. బంగారం 19 గ్రాములు, వెండి 890 గ్రాములు, విదేశీ కరెన్సీ నోట్లు 50 వచ్చినట్లు వివరించారు. అలాగే ఆలయ క్షేత్రపాలకుడు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి ఆలయ హుండీల ద్వారా రూ 4,22,210 ఆదాయం లభించిందన్నారు. దేవదాయశాఖ రాజమహేంద్రవరం ఇన్‌స్పెక్టర్ టీవీఎస్‌ఆర్ ప్రసాద్, గ్రూపు దేవాలయాలు గ్రేడ్ –1 ఈఓ ఎన్‌వీఎన్‌ఎస్‌వీ ప్రసాద్‌రాజు, గోపాలపురం గ్రూపు దేవాలయాలు గ్రేడ్ – 3 ఈఓ బి.కిరణ్ పర్యవేక్షణలో దేవస్థానం మాజీ చైర్మన్ కరుటూరి నరసింహారావు, ఉప సర్పంచ్ పోచిరాజు బాబూరావు సమక్షంలో అర్చకులు, గ్రామస్తులు, శ్రీవారి సేవకులు ఈ ఆదాయాన్ని లెక్కించారు.
Comments
Please login to add a commentAdd a comment