ఏటిగట్టుపై కనువిందు
సాక్షి, అమలాపురం: గోదావరి వరదల నుంచి రక్షించే ఏటిగట్లు పాడి రైతులకు మేలు చేసే పశుగ్రాసాల పెంపకానికి అనువుగా మారాయి. దీని వల్ల ఏటిగట్లకు సైతం మేలు జరుగుతోంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ఏటిగట్లు ఎక్కువగా ఉంటాయి. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు, కపిలేశ్వపురం, కె.గంగవరం, ఐ.పోలవరం, ముమ్మిడవరం, కాట్రేనికోన, అల్లవరం, అమలాపురం రూరల్, అంబాజీపేట, అయినవిల్లి, పి.గన్నవరం, మామిడికుదురు, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో గౌతమీ రైట్, లెఫ్ట్ బ్యాంకు, వైనతేయ రైట్, లెఫ్ట్ బ్యాంకు, వశిష్ట లెఫ్ట్, వృద్ధ గౌతమీ రైట్, లెఫ్ట్ బ్యాంకులు ఉన్నాయి. వీటి నడివిడి సుమారు 400 కిలోమీటర్లు. గట్ల పటిష్టం కోసం ఇరువైపులా పశుగ్రాసాలను పెంచేలా సాగునీటిపారుదల శాఖ అధికారులు ప్రోత్సహిస్తుంటారు. పశుగ్రాసాలు పెంచడం వల్ల వేర్లు బలంగా ఉండడం వల్ల వరదల సమయంలో గట్లు కొట్టుకుపోకుండా ఉంటాయి. జిల్లాలో ఆత్రేయపురంతో పాటు పశువులు అధికంగా ఉండే మిగిలిన మండలాల్లో సైతం ఏటిగట్ల మీద పశుగ్రాసాలు పెంచుతున్నారు. కొంతమంది రైతులు పశుగ్రాసాలకు స్పింక్లర్లు ఏర్పాటు చేసి నీటికి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఆత్రేయపురం మండలం వాడపాలెం వద్ద గుట్టుకు ఇరువైపులా పెద్ద ఎత్తున పశుగ్రాసాలు పెంచుతున్నారు. వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి వస్తున్న భక్తులకు ఏటిగట్ల మీద పచ్చని తివాచీ పరిచినట్టుగా ఏటిగట్టు, వాటి మీద స్పింక్లరుల, వాటి చెంతనే సాగవుతున్న బంతి, చేమంతి, కనకాంబరాలు, గులాబీ పువ్వుల తోటలతో ఈ ప్రాంతం అందమైన ఉద్యాన వనంగా కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి.
పశుగ్రాసం పెంపకం
స్పింక్లర్లతో నీరు పిచికారీ
ఆకట్టుకుంటున్న పూల తోటలు
Comments
Please login to add a commentAdd a comment