రుగ్వేద మహా సభలు ప్రారంభం
పి.గన్నవరం: ముంగండ గ్రామంలోని చింతామణి గణపతి మందిరంలో బుధవారం రుగ్వేద సంహిత పారాయణ, వేద విద్వత్ మహా సభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి సుమారు 70 మంది రుగ్వేద పండితులు హాజరయ్యారు. ఐదు రోజుల పాటు ఈ సభలు జరుగుతాయి. రుగ్వేదాన్ని పరిరక్షించేందుకు ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్టు ముంగండ ఆశ్వలాయన మహిర్షి రుగ్వేద పరిషత్ సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం గ్రామంలోని ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం నుంచి సభాస్థలి వరకూ గ్రామ ప్రదక్షిణ జరిగింది. ఈ సందర్భంగా గణపతి పూజ, స్వస్తి వాచనం, పుణ్యాహవాచనం, పంచగవ్యప్రాశన, అఖండ స్థాపన, వేద పురుష కలశస్థాపన నిర్వహించారు. అనంతరం పండితులు వేద పఠనం చేశారు. కార్యక్రమాలకు ఆశ్వలాయన మహర్షి రుగ్వేద పరిషత్ సభ్యులు ఆధ్వర్యం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment