హోప్ ఐలాండ్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ
తాళ్లరేవు: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోరంగి పంచాయతీ పరిధిలోని హోప్ ఐలాండ్ దీవిలో బుధవారం వివిధ శాఖల అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆక్రమణలకు గురవుతున్న ఐలాండ్‌లను సంరక్షించే చర్యలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తాళ్లరేవు ఎంపీడీఓ కె.సత్యనారాయణ తెలిపారు. మన రాష్ట్రంలో 32 ఐలాండ్లు ఉన్నాయని, వాటిలో రిపబ్లిక్ డేకు ముందుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయన్నారు. దీనిలో భాగంగా హోప్ ఐలాండ్‌లో స్థానిక ప్రజల సమక్షంలో ఎంపీడీఓ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి వీజెవీ రమణ, ఫారెస్ట్ రేంజర్ ఎస్‌ఎస్‌ఆర్ వర ప్రసాద్, మైరెన్ సీఐ రామ్మోహన్‌రెడ్డి, నేవీ అసిస్టెంట్ కమాండర్ మణిషచాన్ తదితరులు జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రామకృష్ణ, ఎఫ్‌డీఓ గోపి, వీఆర్వో శ్రీను పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment