పి.గన్నవరం: స్థానిక మూడు రోడ్ల సెంటర్ నుంచి పోతవరంలో కోకోనట్ కల్యాణ మండపం వరకూ సుమారు కిలోమీటరు మేర సీసీ రోడ్డు నిర్మిస్తున్న నేపథ్యంలో ఈ నెల 24 నుంచి రాకపోకలు బంద్ చేసినట్టు ఆర్‌అండ్‌బీ డీఈఈ జి.రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నెల రోజులపాటు ఈ రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నామని వివరించారు. స్థానిక మూడురోడ్ల సెంటర్ నుంచి 10 మీటర్ల వెడల్పున సీసీ రోడ్డు పనులను ప్రారంభించనున్నట్టు చెప్పారు. రాజోలు నుంచి పి.గన్నవరం మీదుగా అమలాపురం వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు.. జగన్నపేట మీదుగా అమలాపురం చేరుకోవాలని సూచించారు. రాజోలు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్లే వాహనాలకు ఇబ్బంది లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment