నేటి నుంచి కోనసీమ క్రీడోత్సవాలు
● ఏర్పాట్లు పూర్తి
● 2,568 మంది క్రీడాకారుల రాక
అమలాపురం రూరల్: జీఎంసీ బాలయోగి స్టేడియంలో బుధ,గురువారం జరిగే కోనసీమ క్రీడోత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. జిల్లా విద్యాశాఖ, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ శాఖలు సంయుక్తంగా ఏర్పాట్లు చేపట్టాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బాలురు, బాలికలకు వేర్వేరుగా మండల స్థాయిలో క్రీడాపోటీలు నిర్వహించారు. మండల స్థాయిలో గెలుపొందినవారు జిల్లాస్థాయి కోనసీమ క్రీడోత్సవాలలో పాల్గొంటారు. అథ్లెటిక్స్ గేమ్స్, వాలీబాల్, కబడ్డీ, కోకో, బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతలు జిల్లా స్థాయి పోటీల్లో పాల్లొంటారు. 2,568 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. జిల్లా స్థాయిలో బాస్కెట్‌బాల్, వెయిట్ లిప్టింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు మెడల్స్, ప్రశంసాపత్రాలు అందిస్తారు. గురువారం సెమీఫైనల్ ఫైనల్ పోటీలను నిర్వహించి సాయంత్రం బహుమతుల ప్రదానోత్సవం నిర్వహిస్తారన్నారు. ఈ పోటీలను కలెక్టర్ మహేష్‌కుమార్ ప్రారంభిస్తారు. ఆర్డీవో కె.మాధవి, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య శిక్షకులు సీఎస్ సురేష్‌కుమార్, డీఈవో సలీం బాషా, స్కూల్ సెక్రటరీ శ్రీనివాస్ ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment