పోలీసుల అదుపులో వైఎస్సార్ సీపీ నాయకులు
తుని రూరల్: ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారనే అనుమానంతో తుని రూరల్ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తేటగుంట గ్రామానికి చెందిన గణేసుల వీరబాబును రూరల్ పోలీసులు శనివారం రాత్రి 11 గంటల వరకూ స్టేషన్లోనే ఉంచారు. అర్ధరాత్రి ఇంటికి పంపించి మళ్లీ ఆదివారం ఉదయమే స్టేషన్కు రప్పించి రాత్రి వరకూ పోలీసులు ఉంచారు. అదేవిధంగా కోటనందూరు మండలం వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ చింతకాయల చినబాబు, అప్పలరాజుపేటకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త బంగారు బ్రహ్మనాయుడిని పోలీసులు రూరల్ స్టేషన్కు తీసుకువచ్చారు. దీనిపై రూరల్ ఎస్సై బి.కృష్ణమాచారిని వివరణ కోరగా వారిపై కేసు నమోదు చేయాల్సి ఉందని, రాత్రికి ఇళ్లకు పంపించి వేస్తున్నట్టు తెలిపారు. సోమవారం సాంకేతిక నిపుణులు సెల్ఫోన్లలో సమాచారాన్ని పరిశీలించిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని ఎస్సై వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment