టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు 20 పోలింగ్ కేంద్రాలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. ఇందులో రాజమహేంద్రవరం అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఆర్‌డీఓ ఆర్.కృష్ణనాయక్, అర్బన్ తహసీల్దార్ పీహెచ్‌జీఆర్ పాపారావుతో కలిసి నగరంలోని పోలింగ్ కేంద్రాలను సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శాసన మండలి పూర్వపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల స్థానానికి వచ్చే నెల 5వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగు జరుగుతుందన్నారు. వచ్చే నెల 12వ తేదీ వరకూ ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు. ఎన్నికల సిబ్బంది సూచనలను అనుసరించి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. పోలింగు కేంద్రం వద్ద అన్ని మౌలిక వసతులూ కల్పించాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పీజీఆర్‌ఎస్‌లో 129 అర్జీలు
కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో 129 అర్జీలు స్వీకరించామని డీఆర్‌ఓ టి.సీతారామమూర్తి తెలిపా రు. ఈ అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 34 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన పబ్లిక్ గ్రీవెన్సెస్ రీడ్రసెల్ సిస్టం(పీజీఆర్‌ఎస్)కు 34 మంది తమ సమస్యలపై ఫిర్యాదు చేశారు. వారితో ఎస్పీ డి.నరసింహ కిశోర్ నేరుగా మాట్లాడి, వారి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాల్సిందిగా సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. సివిల్ కేసులు, కుటుంబ సమస్యలు, చీటింగ్, కొట్లాట, దొంగతనం, ఇతర కేసులకు సంబంధించిన ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎంబీఎం మురళీకృష్ణ, స్పెషల్ బ్రాంచి ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
టెన్ట్ పరీక్షల ఫీజుకు
26 వరకూ గడువు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు ఫీజు చెల్లింపు పక్రియ ప్రారంభమైంది. జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు సోమవారం ఈ వివరాలు తెలిపారు. ఎటువంటి ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 26వ తేదీలోగా విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చు. రూ.50 అపరాధ రుసుంతో 27 నుంచి డిసెంబర్ 2 వరకూ, రూ.200 అపరాధ రుసుంతో డిసెంబర్ 3 నుంచి 9 వరకూ, రూ.500 అపరాధ రుసుంతో డిసెంబర్ 10 నుంచి 16వ తేదీ వరకూ పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
నామినల్ రోల్స్, డాక్యుమెంట్లను ప్రధానోపాధ్యాయులు ఈ నెల 26వ తేదీలోగా అందజేయాలి. పరీక్ష ఫీజును డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ నుంచి స్కూల్ లాగిన్ ద్వారా చెల్లించాలి. సీఎఫ్‌ఎంఎస్, బ్యాంకు చెల్లింపులను అనుమతించరు. పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించరు.
పరీక్ష ఫీజు వివరాలివీ..
ఫ రెగ్యులర్ విద్యార్ధులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125.
ఫ మూడు అంతకంటే తక్కువ సబ్జెక్టులు ఉన్న వారు రూ.110.
ఫ మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఉన్న వారు రూ.125.
ఫ వృత్తి విద్యా కోర్సు విద్యార్థులు పరీక్ష ఫీజు రూ.125తో పాటు అదనంగా రూ.50 చెల్లించాలి.
ఫ తక్కువ వయస్సు ఉన్న విద్యార్థులు కాండొనేషన్ ఫీజు రూ.300 చెలించాలి.
ఫ అవసరమైతే మైగ్రేషన్ సర్టిఫికెట్‌కు రూ.80 చెల్లించాలి.
Comments
Please login to add a commentAdd a comment