108 ఉద్యోగుల రిలే దీక్ష
రాజమహేంద్రవరం రూరల్: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ బొమ్మూరులోని కలెక్టరేట్ వద్ద 108 ఉద్యోగులు సోమవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. 108 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈఎన్‌వీ రమణ, గుజ్జుల రమేష్‌బాబు ఆధ్వర్యాన జె.నానాజీ, జి.రమేష్‌బాబు, ఎన్.శ్రీనివాస్, పి.జగపతిబాబు, వాసు, సునీత రిలే దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా రమణ, రమేష్‌బాబు మాట్లాడుతూ, 108 అంబులెన్స్ వ్యవస్థను ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని, తమను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని, రోజుకు మూడు షిఫ్టులలో 8 గంటల పని విధానం అమలు చేయాలని, ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని, వైద్య, ఆరోగ్య శాఖలో ఈఎంటీ పోస్టుల్లో 108 ఈఏంటీలను నియమించాలని, 108 వాహనాలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ కార్యదర్శి పూర్ణిమరాజు సాయంత్రం నిమ్మరసం ఇచ్చి రిలే దీక్షలను విరమింపజేశారు. 108 ఉద్యోగుల దీక్షకు అంగన్‌వాడీ ఉద్యోగుల సంఘం, ఆశా కార్యకర్తల సంఘం మద్దతు తెలిపాయని జిల్లా కమిటీ సభ్యులు వేంకటేశ్వరరావు, రమేష్‌నాయుడు, శ్రీధర్, నంది రాజు, శ్రావణి, సుమలత, విజయ తదితరులు పాల్గొన్నారు.
అదనపు ఎస్పీగా మురళీకృష్ణ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా అదనపు ఎస్పీగా ఎన్‌బీఎం మురళీకృష్ణ సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డి.నరసింహ కిషోర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment